సుజిత్ మాట విన‌ని యూవీ క్రియేష‌న్స్‌?

సాహో డివైడ్ టాక్‌కి ఎన్నో కార‌ణాలు. ప్రేక్ష‌కులు అంచ‌నాలు పెంచుకుని రావ‌డం ఓ కార‌ణ‌మైతే, తెలిసి తెలిసి సాహో టీమ్ చేసిన త‌ప్పులు కొన్నున్నాయి. మ‌రీ ముఖ్యంగా చివ‌ర్లో ద‌ర్శ‌కుడు సుజిత్‌కి యూవీ క్రియేష‌న్స్ ఫ్రీ హ్యాండ్ ఇవ్వ‌క‌పోవ‌డం మ‌రింత మైన‌స్ గా మారింది. సినిమా నిడివి విష‌యంలో త‌న అభ్యంతరాన్ని ముందు నుంచీ చెబుతూనే ఉన్నాడ‌ట సుజిత్‌. కానీ యూవీ అతి ధీమా ప్ర‌ద‌ర్శించింది. పాట‌లు సాహోకి అతి పెద్ద మైన‌స్‌గా మారాయి. ఈ పాట‌ల విష‌యంలోనూ సుజిత్ కొన్ని అభిప్రాయాలు చెప్పాడ‌ట‌. కేవ‌లం హిందీ వెర్ష‌న్‌కి మాత్ర‌మే పాట‌లు ఉండాల‌ని, తెలుగులో వాటిని తీసేయాల‌ని సూచించాడ‌ట‌. కానీ నిర్మాత‌లు విన‌లేద‌ని తెలిసింది. పాట‌లు లేక‌పోతే తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఈ సినిమా ఏమాత్రం ఎక్క‌ద‌ని, ప్ర‌భాస్ అభిమానులు బాగా నిరుత్సాహ‌డ‌తార‌ని సుజిత్‌కి స‌ర్దిచెప్పారట‌. నిజానికి తొలి ఫైట్ అవ్వ‌గానే ప్ర‌భాస్‌పై ఓ ఇంట్ర‌డ‌క్ష‌న్ పాట‌ని కూడా ప్లాన్ చేశారట‌. కానీ… ఆ పాట క‌థా గ‌మ‌నానికి అడ్డుత‌గులుతుంద‌ని భావించి రికార్డ్ చేయించినా స‌రే, చిత్రీక‌రించ‌కుండా ఆపేశారట‌. ఆ రూపంలో చిత్ర‌బృందానికి రెండు మూడు కోట్లు ఆదా అయిన‌ట్టే. ఈ సినిమాల‌లో తొల‌గించిన స‌న్నివేశాలు చాలానే ఉన్నాయి. వాటిని స్క్రిప్టు ద‌శ‌లోనే క‌త్తిరించాల్సింది. రాసుకున్న ప్ర‌తీ స‌న్నివేశాన్ని తెర‌కెక్కించ‌డం వ‌ల్ల స‌మ‌యం, డ‌బ్బు రెండూ వృధా అయ్యాయి. ఈ విష‌యంలో సుజిత్‌ది ఎంత త‌ప్పు ఉందో, నిర్మాత‌ల‌దీ అంతే త‌ప్పు ఉంది. కానీ ఆ అప‌వాద‌ను ఇప్పుడు సుజిత్ మోస్తున్నాడు. ఆ న‌ష్టాల్ని యూవీ ఎదుర్కొంటోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ దళిత రైతు ఆత్మహత్య ప్రభుత్వ హత్యే..!

నెల్లూరు జిల్లాలో ఓ దళిత రైతు.. తన భూమిని బలవంతంగా లాక్కుంటున్నారన్న ఆవేదనతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఇలాంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల జరుగుతున్నాయి. అయితే.....

‘ల‌వ్ స్టోరీ’ ప్లానింగు ఇదీ….

సాధార‌ణంగా శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలు తీసే తీరు పాసింజ‌ర్ రైలుని త‌ల‌పిస్తుంటాయి. ఆగి... ఆగి.. కొంచెం.. కొంచెం.. త‌న మూడ్ ని బ‌ట్టి, షూటింగ్ చేస్తుంటాడు శేఖ‌ర్ క‌మ్ముల‌. దానికి త‌గ్గ‌ట్టుగా లాక్...

ఆర్‌.ఎఫ్‌.సీలో సెటిలైపోతున్న రౌడీ

పూరి జ‌గ‌న్నాథ్ - విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. విజ‌య్ న‌టిస్తున్న తొలి పాన్ ఇండియా ప్రాజెక్టు ఇది. క‌థ ప్ర‌కారం సినిమా మొత్తం ముంబైలోనే...

‘ఓ పిట్ట క‌థ’ లాభాల వెనుక పెద్ద క‌థ‌

లాక్ డౌన్‌కి ముందు, థియేట‌ర్లు మూసివేయ‌డానికి ఓ వారం ముందు విడుద‌లైన సినిమా 'పిట్ట‌క‌థ‌'. మంచి ప‌బ్లిసిటీతో విడుద‌లైన ఈ చిన్న సినిమా.. బాక్సాఫీసు ద‌గ్గ‌ర ఏ ర‌క‌మైన ప్ర‌భావాన్నీ చూపించ‌లేక‌పోయింది. క‌రోనా...

HOT NEWS

[X] Close
[X] Close