కుర్ర హీరోతో మ‌ళ్లీ రిస్క్ చేస్తున్న యూవీ

యూవీ క్రియేష‌న్స్‌కి ఆస్థాన హీరోగా మారిపోయాడు సంతోష్ శోభ‌న్‌. త‌ను ఇప్ప‌టి వ‌ర‌కూ చేసిన సినిమాల్లో స‌గం ఆ బ్యాన‌ర్ నుంచి వ‌చ్చిన‌వే. `ఏక్ మినీ క‌థ‌` ఓటీటీ వ‌ల్ల డ‌బ్బులు తెచ్చుకొంది. మిగిలిన‌వ‌న్నీ ఫ‌ట్ట్ మన్నాయి. అయితే.. యూవీని సంతోష్‌, సంతోష్‌ని యూవీ వ‌ద‌ల‌డం లేదు. తాజాగా సంతోష్ శోభ‌న్ తో యూవీ మ‌రో సినిమా చేస్తోంది. విచిత్రం ఏమిటంటే… ఇది చిన్న సినిమా ఏం కాదు. దాదాపు రూ.25 కోట్లు పెట్టుబ‌డి పెడుతున్నారు. ఈ సినిమాతో సంతోష్‌ని యాక్ష‌న్ హీరోగా ప్ర‌జెంట్ చేయ‌బోతున్నార్ట‌. శ్రీ‌రామ్ రెడ్డి అనే ద‌ర్శ‌కుడు ఈ సినిమాతో ప‌రిచ‌యం అవుతున్నాడు. శ్రీ‌రామ్ ఆదిత్య ద‌గ్గ‌ర శిష్య‌రికం చేశాడు శ్రీ‌రామ్ రెడ్డి. శ‌మంత‌క‌మ‌ణి, దేవ‌దాసు చిత్రాల‌కు ప‌ని చేశాడు.

ఇదో యాక్ష‌న్ సినిమా. గోపీచంద్ లాంటి హీరోల‌కు ఈ క‌థ చెప్పాడు శ్రీ‌రామ్ రెడ్డి. కానీ.. వాళ్లు లైట్ తీసుకొన్నారు.చివ‌రికి యూవీ ద‌గ్గ‌ర సెట్ అయ్యాడు. గోపీచంద్ లాంటి హీరోల‌కు సెట్ట‌య్యే క‌థ‌ని.. సంతోష్ ఎలా క్యారీ చేస్తాడ‌నుకొన్నారో ఏమో..? ఇది ఆర్మీ నేప‌థ్యంలో సాగే సినిమా అని తెలుస్తోంది. సంతోష్ శోభ‌న్ సైనికుడిగా క‌నిపించే అవ‌కాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

పరశురాం డబ్బులు వెనక్కి ఇస్తాడా ?

ఫ్యామిలీ స్టార్ నిరాశ పరిచింది. విజయ్ దేవరకొండ, పరసురాం సక్సెస్ కాంబినేషన్ లో మంచి అంచనాలతో వచ్చిన సినిమా అంచనాలని అందుకోలేకపోయింది. గీతగోవిందం మ్యాజిక్ మరోసారి వర్క్ అవుట్ అవుతుందని భావించారంతా. కానీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close