రివ్యూ: వధువు (హాట్‌స్టార్‌ వెబ్ సిరీస్‌)

ఓటీటీ వేదికలకు కూడా కంటెంట్ కొరత చాలా వుంది. సొంత కథని ఒప్పించి ఒరిజినల్ సిరీస్ తీయడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇలాంటి పరిస్థితిలో వెబ్ సిరిస్ లని కూడా రిమేక్ చేస్తున్నారు. తమ ఛానల్ సబ్ స్క్రైబర్స్ కి ఒక మంచి కంటెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆల్రెడీ ఒక భాషలో విజయవంతమైనప్పటికీ పెద్దగా ప్రచారం లేని సిరిస్ లని ఎంచుకొని రిమేక్ చేస్తున్నారు. ఈ క్రమంలో బెంగాలీ కంటెంట్ పై ఎక్కువ ద్రుష్టి పెడుతున్నారు. ఇటివలే దయా పేరుతో ఒక బెంగాలీ వెబ్ సిరిస్ రిమేక్ చేశారు. ఇప్పుడు మరో బెంగాలీ రిమేక్ గా ‘వధువు’ వచ్చింది. అవికా గోర్‌, నందు, అలీ రెజా ప్రధాన పాత్రలు పోషించిన ఈ సిరిస్ బెంగాలీ సిరీస్‌ ‘ఇందు’కు రీమేక్‌. డిస్నీ+హాట్‌స్టార్‌ లో విడుదలైయింది. మరి, రిమేక్ చేయదగ్గ ‘వధువు’ కంటెంట్ ఏమిటి ? ఈ డార్క్ ఫ్యామిలీ సస్పెన్స్ డ్రామా ప్రేక్షకులని అలరించిందా ?

ఇందు(అవికా గోర్‌)పెళ్లి… పెళ్లి పీటలపై ఆగిపోతుంది. మరికొన్ని నిమిషాల్లో పెళ్లి ముహూర్తం ఉండగా ఇందుకు కాబోయే వరుడుని స్వయంగా ఇందు చెల్లెలు భాను లేవదీసుకు పారుపోతుంది. దీంతో కుటుంబం అంతా దిగ్భ్రాంతికి గురౌతుంది. కొన్నాళ్ళుకు ఆ బాధ నుంచి తేరుకొని ఆనంద్‌ (నందు)తో వివాహం జరిపిస్తారు ఇందు కుటుంబ సభ్యులు. అయితే ఈ పెళ్లి కూడా చాలా అనుమానాలు, సందేహాలు మధ్య జరుగుతుంది. లేచిపోయిన భాను భర్తతో సడన్ గా పెళ్ళిలో ప్రత్యేక్షమౌతుంది. మూడుముళ్ళు వేయడానికి ఇంకో పది నిముషాలు వుండగా.. ఇందు సడన్ గా కనిపించకుండా పోతుంది. తనని పెరట్లో పెట్టి ఎవరో తలుపు గొళ్ళెం పెడతారు. ఇందు మరిది ఆర్య (అలీ రెజా) అనూహ్యంగా అక్కడి చేరుకొని ఆమెను పెళ్లి మండపానికి తీసుకొస్తాడు. అంతకుముందు పనసపండులో విషపూరిత ఉమ్మెత్త ఆకుని కుట్టి ఇందుకు శారిగా పంపిస్తారు. అత్తారింటిలో అడుపెట్టగానే మతిస్థిమితం లేని ఆడపడుచు ‘నిన్ను చంపేస్తారు పారిపో’అని ఇందుని హెచ్చరిస్తుంది. అప్పటికే ఆర్యకి వైష్ణవితో పెళ్లి జరిగుంటుంది. కానీ ఆ విషయాన్ని ఇందుకు తెలియకుండా అందరు దాచేస్తారు. అత్తారింటిలో గడిపిన మొదటిరోజే ఇందు ఆడపడుచుపై హత్యాయత్నం జరుగుతుంది. అక్కడ ప్రతివ్యక్తిలో ఎదో అంతు చుక్కని రహస్యాలు వున్నాయని తొలి రోజే ఇందుకు అర్ధమౌతుంది. మరి ఇందు ఆ రహస్యాలని చేధించిందా? వైష్ణవి కథ ఏమిటి ? అసలు ఆ కుటుంబంలో ఏం జరుగుతోంది ? అనేది తక్కిన సిరీస్.

ముందుగా ఈ సిరిస్ ఒరిజినల్ క్రియేటర్ సహానా దత్తా గరించి ప్రస్థావించాలి. భూత్, గోయెండ గిన్ని, జై కాళీ కలకత్తావాలి.. లాంటి ఆసక్తికరమైన షోస్ ని క్రియేట్ చేసి వెబ్ ఆడియన్స్ లో మంచి పేరు తెచ్చుకున్నారు సహానా. ముఖ్యంగా సహనా రచనల్లో స్త్రీ పాత్రలు డిటెక్టివ్ తరహా పాత్రలు పోషించడం, ఫ్యామిలీ డ్రామాలో షెర్లాక్ హోమ్స్ ఫ్లేవర్ ని యాడ్ చేసి సస్పెన్స్ ని క్రియేట్ చేయడంలో దిట్ట అనిపించుకున్నారు. ‘వధువు’ కూడా అలాంటి డార్క్ ఫ్యామిలీ షెర్లాక్ హోమ్స్ స్టొరీనే. ఈ కథని పాత్రలని సెటప్ చేసిన విధానం సస్పెన్స్ తో కట్టిపడేస్తుంది. వెబ్ సిరిస్ లో తొలి ఎపిసోడ్, అవసరమైతే తొలి సీన్ లో వాట్ నెక్స్ట్ అనే ఆసక్తిని ప్రేక్షకుల్లో క్రియేట్ చేయాలి. ఆ విషయంలో వధువు సస్పెన్స్ ఫ్యామిలీ డ్రామా చక్కగా హోల్డ్ చేస్తుంది. అక్కకు కావాల్సిన భర్తతో చెల్లి పారిపోవడంతో ఏం జగరబోతుందనే ఆసక్తి సహజంగానే క్రియేట్ అవుతుంది. తర్వాత వచ్చే ఆనంద్‌ (నందు) తో జరిగే రెండో పెళ్లి.. అంతుచిక్కని రహస్యాలు మోస్తున్న ఆనంద్ కుటుంబం.. మతిస్థిమితం లేని చెల్లాయి.. ఇవన్నీ క్రమంగా సిరిస్ లోకి తీసుకెళ్ళిపోతాయి.

ఇందు అత్తారింటికి చేరిన తర్వాత అక్కడ జరిగే పరిణామాలు మంచి సస్పెన్స్ ని బిల్డ్ చేస్తాయి. అక్కడ ప్రతి పాత్ర తేడాగానే వుంటుంది. ఇక్కడే సహనా దత్త మార్క్ షెర్లాక్ హోమ్స్ కథానాయికి రహస్యాలని చేధించడానికి ప్రయత్నిస్తుంది. ఆ ప్రయాణం.. ఒక దశలో ఆమె కోడలిగా వచ్చిందా ? సిఐడి ఆఫీసరా ? అనే భావన కూడా కలిగిస్తాయి. మొదటి నాలుగు ఎపిసోడ్స్ తర్వాత ఈ కథ పూర్తిగా ఆర్య భార్య వైష్ణవి పాత్ర చుట్టూ తిరుగుతుంది. ఆ క్రమంలో వచ్చే మలుపులు ఆసక్తికరంగానే వుంటాయి. అయితే ఇందులో కూడా కొన్ని లోపాలు వున్నాయి. సస్పెన్ ని బిల్డ్ చేయడం ఎంత ముఖ్యమో దానిని రివిల్ చేసేటప్పుడు వచ్చే సన్నివేశాలు అంతే ఉత్కంఠతో వుండాలి. వధువులో అది కనిపించదు. చాలా వరకూ డైలాగులకే పరిమితమైపోతుంది. ఇందు, ఆర్య పాత్రలతో పాటు మిగతా పాత్రలు మాటలకే పరిమితం అవుతారు. పైగా ప్రతి పాత్ర చుట్టూ చాలా అనుమానాలు రేకెత్తించారు. వాటికి ముగింపు మాత్రం ఇవ్వలేకపోయారు. దీనికి సీజన్ 2 కూడా వుంది. అందులో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

ఇందు పాత్రలో చేసిన అవికా గోర్‌ కి ఇది తగిన పాత్ర. ఆ పాత్రకు ఆమె సరైన ఎంపిక కూడా. లేడి షెర్లాక్ హోమ్స్ గా ఆమె తెగువ ఆకట్టుకుంటుంది. అయితే ఆమె పాత్ర ఈ సీజన్ లో ఇంకా పూర్తి రివిల్ కాలేదు. మొదటి నుంచి కొంచెం సస్పెన్స్ ఫుల్ గా ప్రవర్తిస్తుంటుంది. దానికి కారణం ఏమిటనేది చూపించలేదు. ఆర్యగా అలీ రెజా ఆకట్టుకుంటాడు. తనకి ఎక్కువ స్క్రీన్ స్పేస్ వుంది. క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ కూడా వుంది. ప్రతిదానికి అనుమాన పడే ఆనంద్‌ పాత్రలో కనిపించాడు నందు. ఇక కుటుంబంలో మిగతా పాత్రలు కూడా పరిధిమేరకు మిస్టీరియస్ గా కనిపించారు.

టెక్నికల్ గా మంచి పని తీరు కనిపిస్తుంది. నేపథ్య సంగీతంకు మంచి మార్కులు పడతాయి. ఇందులో హారర్ ఎలిమెంట్ లేదు కానీ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ తో భయపెట్టే కొన్ని సన్నివేశాలు కనిపిస్తాయి. కెమెరా పనితీరు ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ పదునుగా వుంది. ప్రొడక్షన్ డిజైన్ విషయానికి వస్తే.. తెలుగు నేటివిటీకి తగట్టుగా మార్చడంలో జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే కొంచెం అతి జాగ్రత్తలుగా కూడా అనిపిస్తాయి. ఇంటీరియర్, హోం డెకరేషన్ లో బెంగాలి ఛాయలు కనిపిస్తాయి. నిడివి ఈ సిరిస్ కి మరో ప్లస్ పాయింట్. కేవలం ఇరవై నిముషాలు నిడివిగల ఏడు ఎపిసోడ్స్. ప్రతి ఎపిసోడ్ లో సస్పెన్స్ కుదరడంతో త్వరగానే పూర్తయిపోయిన భావన కలుగుతుంది. సస్పెన్స్ తో కూడిన ఒక ఫ్యామిలీ థ్రిల్లర్ చూడాలనుకునే వారికి ‘వధువు’ నచ్చుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close