మారిన‌ ‘వ‌కీల్ సాబ్‌’ ప్రీరిలీజ్ ఈవెంట్‌ ప్లాన్‌

తెలుగు రాష్ట్రాల‌లో `వ‌కీల్ సాబ్` మానియా మొద‌లైపోయింది. ఏప్రిల్ 9న ఈ సినిమా విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే.. ప్ర‌మోష‌న్లు భారీగా జ‌రుగుతున్నాయి. `వ‌కీల్ సాబ్‌` ట్రైల‌ర్ రాక‌తో.. ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌కు ఓ ఊపు వ‌చ్చింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ తో దాన్ని ప‌తాక స్థాయికి తీసుకెళ్లాల‌ని చిత్ర‌బృందం భావిస్తోంది. అయితే ఈ స్పీడుకు తెలంగాణ పోలీసులు అడ్డు క‌ట్ట వేశారు. ఏప్రిల్ 3న యూసుఫ్‌గూడ పోలీస్‌ లైన్స్‌లోని స్పోర్ట్స్‌ గ్రౌండ్స్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసింది చిత్ర‌బృందం. అయితే ఈ కార్య‌క్ర‌మానికి అనుమ‌తులు ల‌భించ‌లేదు. కరోనా కేసులు మ‌ళ్లీ విజృంభిస్తున్న వేళ‌… ఎలాంటి సభలు, సమావేశాలకు అనుమతులు లేవని తెలంగాణ పోలీసులు తేల్చి చెప్పేశారు.

అందుకే ఇప్పుడు వ‌కీల్ సాబ్ ప్లానింగ్ మారింది. ఏప్రిల్ 4న ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హించ‌బోతున్నారు. ఈసారి హైటెక్స్ లో. ఇది వ‌ర‌కు 6 నుంచి 8 వేల మంది అభిమానుల‌తో ఫంక్ష‌న్ ఏర్పాటు చేసుకునేందుకు దిల్ రాజు అనుమ‌తులు అడిగారు. ఈసారి అభిమానుల సంఖ్య 2 వేల‌కు ప‌రిమితం కానున్న‌ద‌ని తెలుస్తోంది. ఈ కార్య‌క్ర‌మానికి చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్‌లు ముఖ్య అతిథులుగా వ‌స్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే చిత్ర‌బృందం ఈ విష‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కూ ఎలాంటి స్ప‌ష్ట‌తా ఇవ్వ‌లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బోల్డ్ గా భయపెట్టిన లైగర్

విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ ల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లైగర్ షూటింగ్ దాదాపు పూర్తయింది. తాజగా లైగర్ నుండి ఒక స్టన్నింగ్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. ఈ...

ఎన్టీఆర్ కథ గోపిచంద్ కు

దర్శకుడు హరి మాస్ సినిమాల స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్నారు. 'సింగం' ఆయన సక్సెస్ఫుల్ సిరిస్. ఈ సిరిస్ కి తెలుగులో కూడా ఆకట్టుకుంది. హరికి ఎప్పటి నుండో నేరుగా ఒక తెలుగు...

సీఎం జగన్ పేరుతో సైబర్ నేరాలు !

అప్పుడెప్పుడో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ. కోట్లు కొట్టేయడానికి దర్జాగా కోల్‌కతా సూట్ కేస్ కంపెనీల పేరుతో చెక్‌లు జమ చేశారు. ఆ కేసు ఇంత వరకూ తేలలేదు. కానీ ఇప్పుడు...

ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ – పబ్లిసిటీ బడ్జెట్ కోట్లకు కోట్లే !

సోషల్ మీడియా సంస్థలకు.. మీడియా సంస్థలకు పండగ లాంటి సమయం ఇది. వద్దంటే రాజకీయ పార్టీలు కుప్పలు కుప్పలుగా ప్రకటనలు ఇస్తున్నాయి. రూ. కోట్లకు కోట్లు ఆదాయం తెచ్చి పెడుతున్నాయి. ఇప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close