29న ‘వ‌కీల్ సాబ్’ ట్రైల‌ర్‌‌

ఈ వేస‌వి మామూలుగా ఉండేలా లేదు. వ‌రుస‌గా అన్నీ పెద్ద సినిమాలే. ఆ పెద్ద సినిమాల జాత‌ర ఏప్రిల్ 9 నుంచి మొద‌లు కాబోతోంది. ఆరోజే `వ‌కీల్ సాబ్` వ‌స్తోంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ నుంచి ఓ సినిమా వ‌చ్చి చాలా కాల‌మైంది. అందుకే ప‌వ‌న్ ఫ్యాన్స్ `వ‌కీల్ సాబ్` కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. మ‌రోవైపు `వ‌కీల్ సాబ్` ప్ర‌మోష‌న్లు కూడా మొద‌లైపోయాయి. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి 3 పాట‌లొచ్చాయి. ఇప్పుడు ట్రైల‌ర్ విడుద‌ల‌కు రంగం సిద్ధ‌మైంది. ఈనెల 29న వ‌కీల్ సాబ్ ట్రైల‌ర్ విడుద‌ల కాబోతోంది. ఈసాయింత్రం 5 గంట‌ల‌కు వ‌కీల్ సాబ్ కి సంబ‌ధించిన అప్ డేట్ ఇస్తాన‌ని చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. అది ట్రైల‌ర్‌కి సంబంధించిన న్యూసే. ఈనెల 29 సాయింత్రం `వ‌కీల్ సాబ్` ట్రైల‌ర్ రిలీజ్ చేయ‌డానికి చిత్ర‌బృందం అన్నిర‌కాలుగా స‌న్న‌ద్ధ‌మైంది. ఆ త‌ర‌వాత ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ప్లాన్ చేసింది. ఈ కార్య‌క్ర‌మంలో చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్‌లు పాల్గొంటార‌ని తెలుస్తోంది. వాళ్లొస్తే… ప‌బ్లిసిటీ పీక్స్‌కి వెళ్లిపోయిన‌ట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టీడీపీ కోసం ఈ వైసీపీ నేతలకు ఎంత ఆరాటమో !

టీడీపీ మహానాడు నిర్వహిస్తోంది. ఆ పార్టీ చేసే విధానాలపై విమర్శలు చేస్తే .. ప్రత్యర్థి అనుకోవచ్చు. కానీ వైసీపీ నేతల రాజకీయమే వేరు. వారు ఫ్లెక్సీల్లో బాలకృష్ణకు ఫోటో లేదని ఏడుస్తున్నారు. సీనియర్...

శకపురుషుని శతజయంతి : తెలుగు.. వెలుగు.. ఎన్టీఆర్ !

ఎన్టీఆర్ గురించి మనం కొత్తగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే ఆయన సినిమాల్లోకి వచ్చినప్పటి నుండి కథలు కథలుగా చెప్పుకుంటూనే ఉన్నాం. చిన్న తనం విషయాలనూ గుర్తు చేసుకుంటున్నాం. సినిమాలు, రాజకీయాలు ఇలా...

ఆ రహస్య సాక్షి జగన్ ఫ్యామిలీ మెంబరేనా ?

వైఎస్ వివేకా హత్య కేసులో ఎవరూ ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అవినాష్ రెడ్డి అరెస్టును తప్పించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు.. ధ్రిల్లర్ ను తలపిస్తూండగా.. వీలైనంత వరకూ ఆయన సక్సెస్ అవుతున్నారు....

రానా సినిమా రాక్షస రాజు !

రానా, తేజ కలయికలో 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా వచ్చింది. ఇప్పుడు రానా తమ్ముడు అభిరాంని పరిచయం చేస్తూ అహింస సినిమా చేస్తున్నారు. దిని తర్వాత రానాతో మరో సినిమా చేయబోతున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close