వల్లభనేని వంశీ .. ఓలుపల్లి రంగా వంటి తన అనుచరుల్ని తీసుకుని ఆజ్ఞాతంలోకి పోయారు.కోర్టు వాయిదాలకు హాజరు కావాల్సి ఉన్నా వారు హాజరు కాలేదు. దీంతో పోలీసులు వారి కోసం వెదుకుతున్నారు. ఇటీవల ఆయనపై ఓ హత్యాయత్నం కేసు నమోదు అయింది. ఆ కేసులో అరెస్టు చేస్తారన్న భయంతో ఆయన ఆజ్ఞాతంలోకి పోయినట్లుగా తెలుస్తోంది.
టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఓ సారి తన ఇంటి ముందు టీడీపీ కార్యకర్తలు నిరసన చేస్తున్నప్పుడు అనుచరులతో వారిపై దాడిచేయించారు. ఆ కేసు నమోదు కావడంతో అరెస్టు భయంతో ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు వెళ్లారు. కానీ కోర్టు నుంచి ఇంకా రిలీఫ్ రాలేదు. హైకోర్టులో విచారణకు వచ్చినా .. మధ్యంతరంగా అరెస్టు కాకుండా ఉత్తర్వులు తెచ్చుకోలేకపోయారు. దాంతో అరెస్టు చేస్తే మళ్లీ జైలుకు పోయి గడపడం కష్టమని భావించి ఆయన పరారయ్యారు. సాధారణంగా కోర్టు వాయిదాలకు హాజరు కాకపోతే సమస్యలు వస్తాయని తెలిసి కూడా ఆయన హాజరు కాలేదు.
ఆయనతో పాటు కొంత మంది అనుచరులు కూడా ఆయనతో పాటు వెళ్లినట్లుగా చెబుతున్నారు. కోర్టులో ఊరట దక్కే వరకూ వంశీ బయటకు రారని చెబుతున్నారు. పోలీసులు ఆయన కోసం వెదుకుతున్నారని చెబుతున్నారు కానీ..ఆయన దాక్కుంటే పట్టుకుని వచ్చి అరెస్టు చేసే అవకాశం లేదు. ఆయనకు ఈ కేసులోనూ అన్ని న్యాయపరమైన అవకాశాలు కల్పిస్తారు. ఎక్కడా రిలీఫ్ దొరకోతే జైలుకెళ్లక తప్పదు. పారిపోయినా ప్రయోజనం ఉండదు.
ఓడిపోయిన తర్వాత కూడా ప్రభుత్వంపై కుట్రలు చేసి అడ్డంగా దొరికిపోయాడు వంశీ. ఏకంగా ఫిర్యాదుదారునే బెదిరించి కేసు వాపసు తీసుకునేలా కుట్ర చేయడంతో పోలీసులు పట్టేసుకున్నారు. తర్వాత వరుసగా చాలా కేసులు తెరపైకి వచ్చి జైల్లో ఉన్నారు. అన్ని కేసుల్లో బెయిల్ రావడంతో బయటకు వచ్చి బెయిల్ షరతుల ప్రకారం కోర్టులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు కొత్త కేసు నమోదు కావడంతో పరారీ కావాల్సి వచ్చింది.