జైలు నుంచి విడుదలైన తర్వాత రోజే వంశీ జగన్ ను కలిశారు. బెరుకు.. బెరుకుగా ఉలిక్కిపడుతున్నట్లుగా కనిపిస్తున్న ఆయనను భార్య పంజకశ్రీ జగన్ ఇంటికి తీసుకెళ్లారు. రాజకీయాలు చేస్తారో లేదో తెలియదు కానీ ప్రస్తుతానికి ఆయన దగ్గర ఓపిక ఉన్నట్లుగా కనిపించడం లేదు. జైలు నుంచి నేరుగా జగన్ ఇంటికి రావాలన్న సందేశాలు వచ్చినా.. ఒక రోజు ఆలస్యంగా కలిశారు. జగన్ను కలిసే ఉద్దేశం లేకపోయినా బలవంతం చేశారన్న ప్రచారం జరుగుతోంది.
జైలు నుంచి బయటకు తీసుకు వచ్చేందుకు వైసీపీ నేతలు చాలా సాయం చేశారని.. పార్టీ పరంగా అండగా ఉన్నామని జగన్ కు కృతజ్ఞత చెప్పకపోతే బాగుండదని ఒత్తిడి చేశారని అంటున్నారు. అయితే వంశీకి ఇప్పటికీ తన దుస్థితికి కారణం ఎవరో ఊహించలేకపోతున్నారు. తెలుగుదేశం పార్టీలో ఆయన ఎలాంటి అగౌరవం జరగలేదు. వైసీపీ గెలిచిందని నకిలీ పట్టాల విషయంలో కేసులు పెడతారని వైసీపీలో చేరారు. అప్పట్నుంచి ఆయనతో వైసీపీ ఓ ఆటాడుకుంది. తప్పుడు మాటలు మాట్లాడించింది. వంశీని రాజకీయంగా ఎందుకూ పనికి రాకుండా చేసింది.
ఓడిపోయాక ఆయన పరిస్థితి దుర్భరంగా మారింది. అయినప్పటికీ జగన్ మాటలు విని సత్యవర్థన్ ను కిడ్నాప్ చేసి.. కొన్ని వ్యవస్థలను మేనేజ్ చేయవచ్చని అంటే.. తొందరపడ్డాడు. దొరికిపోయాక.. కేసుల మీద కేసులు పడ్డాయి. ఇప్పటికీ ఆయనకు ముప్పు తొలగిపోలేదు. సుప్రీంకోర్టుకు అక్రమ మైనింగ్ రిపోర్టు సమర్పించబోతున్నారు. తన జీవితాన్ని కుక్కలు చింపిన విస్తరి చేసిన జగన్ దగ్గరకు మళ్లీ వెళ్లడంతో పాపం అనుకుంటున్నారు ఆయన ఫ్యాన్స్.