గ్యాంగ్ లీడ‌ర్ కోసం.. వెనక్కి వెళ్లిన వాల్మీకీ

సెప్టెంబ‌రు 13న ఒకేసారి రెండు సినిమాలు రాబోతున్నాయి. ఒక‌టి గ్యాంగ్ లీడ‌ర్ అయితే, మ‌రోటి వాల్మీకి. రెండూ క్రేజీ ప్రాజెక్టులే. ఓ సినిమా వ‌ల్ల మ‌రో సినిమా వ‌సూళ్లపై దెబ్బ ప‌డే ప్ర‌మాదం ఉంది. అందుకే ఇప్పుడు ఇద్ద‌రు నిర్మాత‌లూ ఓ నిర్ణ‌యానికి వ‌చ్చారు. క‌ల‌సి కూర్చుని మాట్లాడుకుని – ఒక‌రు త‌గ్గ‌డానికి రెడీ అయ్యారు. ముందు అనుకున్న ప్ర‌కారం 13న గ్యాంగ్ లీడ‌ర్ వ‌స్తోంది. ఓ వారం త‌ర‌వాత‌.. అంటే 20న వాల్మీకి విడుద‌ల అవుతుంది. దాని వ‌ల్ల రెండు సినిమాల‌కూ లాభ‌మే. గ్యాంగ్ లీడ‌ర్ అప్పుడే ప్ర‌మోష‌న్లు ప్రారంభించేసింది. రేపు (బుధ‌వారం) ట్రైల‌ర్‌ని విడుద‌ల చేస్తారు. సెప్టెంబ‌రు మొద‌టి వారంలో ప్ర‌మోష‌న‌ల్ గీతం వ‌స్తుంది. మ‌రోవైపు వాల్మీకి కూడా ప్ర‌మోష‌న్ల‌కు శ్రీ‌కారం చుట్టింది. టీజ‌ర్ ఇప్ప‌టికే వ‌చ్చేసింది. థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ కూడా రెడీ అవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంగ్లిష్ మీడియం కోసమూ సుప్రీంకోర్టుకు ఏపీ సర్కార్..!

వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీలో ఇంగ్లిష్ మీడియం మాత్రమే ఉండాలనే పట్టుదలను ప్రదర్శిస్తున్న ఏపీ సర్కార్.. సుప్రీంకోర్టు తలుపు తట్టింది. ఇంగ్లీష్ మీడియంపై హైకోర్టు ఆదేశాలను సుప్రీంలో...

కృష్ణా బోర్డు భేటీలో ఎప్పటి వాదనలే.. ఎప్పటి వాటాలే..!

కృష్ణా నద యాజమాన్య బోర్డు భేటీలో ఆరు గంటలు వాదోపవాదాలు చేసుకున్నా..చివరికి మొదటికే వచ్చారు రెండు రాష్ట్రాల అధికారులు. ఇద్దరి వాదనలుక..కేఆర్ఎంబీ బోర్డు.. డీపీఆర్‌లు సమర్పించాలనే సూచనతో ముగింపునిచ్చింది. డీపీఆర్‌లు...

తూచ్.. విజయ్‌ మాల్యాను అప్పగించరట..!

విజయ్ మాల్యాను అప్పగించడం లేదని బ్రిటన్ ప్రభుత్వం తేల్చేసింది. న్యాయపరమైన ప్రక్రియ పూర్తి కాలేదని.. చట్ట లాంచనాలు పూర్తి చేయాల్సి ఉందని అక్కడి ప్రభుత్వం చెబుతోంది. అవి ఏమిటో..ఎప్పుడు పూర్తవుతాయో..మాత్రం చెప్పడం లేదు....

బాల‌య్య ఇంట్లో విందు… చిరు వ‌స్తాడా?

జూన్ 10... బాల‌కృష్ణ పుట్టిన రోజు. ఈసారి పుట్టిన రోజు ప్ర‌త్యేక‌త ఏమిటంటే.. ఇది ఆయ‌న ష‌ష్టి పూర్తి మ‌హోత్స‌వ సంవ‌త్స‌రం. అందుకే ఈ పుట్టిన రోజుని కాస్త ప్ర‌త్యేకంగా జ‌రుపుకోవాల‌ని బాల‌య్య...

HOT NEWS

[X] Close
[X] Close