‘వాల్మీకి’ టైటిల్ మారింది: ఇక గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్‌

వాల్మీకి టైటిల్ మారింది. ఇక నుంచి ఈ సినిమా పేరు.. `గ‌డ్డ‌ల‌కొండ గ‌ణేష్‌`. ఓ క‌మ‌ర్షియ‌ల్ సినిమాకి వాల్మీకి అనే పేరు పెట్ట‌డం వ‌ల్ల త‌మ మ‌నోభావాలు దెబ్బ‌తింటున్నాయ‌ని బోయ సామాజిక వ‌ర్గం అభ్యంత‌రాలు తెలిపింది. క‌ర్నూలు, అనంత‌పురం జిల్లాల‌లో వాల్మీకి సినిమా విడుద‌ల‌ను నిలిపివేస్తూ జిల్లా కలెక్ట‌ర్లు ఉత్త‌ర్వులు జారీ చేశారు. దాంతో చిత్ర‌బృందం దిగిరాక త‌ప్ప‌లేదు. వాల్మీకి పేరుని గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌గా మారుస్తూ.. చిత్ర‌బృందం అత్య‌వ‌స‌ర నిర్ణ‌యం తీసుకుంది. కొద్ది సేప‌టి క్రిత‌మే ఈ విష‌యాన్ని అధికారికంగానూ ప్ర‌క‌టించింది. ఈచిత్రంలో వ‌రుణ్‌తేజ్ పాత్ర పేరు గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌. అందుకే ఈ పేరు పెట్టారు. మొత్తానికి సినిమా పేరు మార్చి, చిత్ర‌బృందం ఈ వివాదానికి పుల్‌స్టాప్ పెట్టింది. అయితే ఇప్ప‌టికే ఫ‌స్ట్ కాపీ అప్ లోడ్ అయిపోయి ఉంటుంది. తొలి రోజు స్క్రీన్ పై వాల్మీకి అనే టైటిల్‌తోనే సినిమా చూడాలి. ఇప్ప‌టికిప్పుడు పోస్ట‌ర్ల‌నీ మార్చే అవ‌కాశం లేదు. ఇవ‌న్నీ ఓ కొలిక్కి వ‌చ్చేట‌ప్ప‌టికి ఒక‌ట్రెండు రోజులు ప‌ట్టొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టాలీవుడ్‌లో బాలకృష్ణ మాటల మంటలు..!

షూటింగ్‌లు ఎప్పుడు ప్రారంభించాలన్నదానిపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో చిరంజీవి నేతృత్వంలో బృందం సమావేశం కావడంపై.. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. షూటింగ్‌లు ఎప్పుడు ప్రారంభించాలా టాలీవుడ్ పెద్దలు..తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు...

కేంద్రం ఏపీపై ఆధారపడినప్పుడు ప్రత్యేక హోదా : జగన్

అప్పు రేపు.. తరహాలో ప్రత్యేకహోదా రేపు అంటున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా గతంలో ఆయన "హోదా యోధ"గా స్వయం ప్రకటితంగా చేసుకున్న పోరాటం ఏమయిందని.. ప్రజలు...

శ్రీవారి ఆస్తులు అమ్మేదిలేదని టీటీడీ బోర్డు తీర్మానం..!

శ్రీవారికి భక్తులు కానుకగా ఇచ్చిన వాటిని అమ్మే ప్రసక్తే లేదని... తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తాజాగా ప్రకటించింది. ఈ మేరకు పాలకమండలి భేటీలో నిర్ణయం తీసుకున్నారు. శ్రీవారి ఆస్తుల అమ్మకాన్ని పూర్తిగా...

ఈ ప్రభుత్వం ఐదేళ్లు ఉండదన్న బాలకృష్ణ, విమర్శించిన మోపిదేవి

ఆంధ్రప్రదేశ్ లో 151 ఎమ్మెల్యే ల మెజారిటీ తో అధికారం లోకి వచ్చిన వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఐదేళ్లపాటు అధికారంలో ఉండదని, అంతకంటే ముందే ఈ ప్రభుత్వం దిగి పోతుందని నందమూరి బాలకృష్ణ...

HOT NEWS

[X] Close
[X] Close