ప‌వ‌న్ చుట్టూ తిరుగుతున్న మ‌రో ద‌ర్శ‌కుడు

ఈమ‌ధ్య ప‌వ‌న్ క‌ల్యాణ్ ధ్యాసంతా సినిమాల‌పైనే వుంది. కొత్త క‌థ‌ల్ని ఒప్పుకోవ‌డం, ద‌ర్శ‌కుల‌కు మాటివ్వ‌డం, అడ్వాన్సులు తీసుకోవ‌డం – ఇలా… సినిమాల‌పై ఫోక‌స్ పెరిగిపోయింది. ద‌ర్శ‌కులు త‌ర‌చూ ప‌వ‌న్‌ని క‌లుస్తూనే ఉన్నారు. క్రిష్ సినిమా సెట్లో సైతం… ద‌ర్శ‌క నిర్మాత‌ల హ‌వా ఎక్కువైంది. ప‌వ‌న్ అప్పాయింట్‌మెంట్ కోసం కొంత‌మంది ప‌డిగాపులు కాస్తున్నారు. ఈజాబితాలో వంశీ పైడిప‌ల్లి కూడా చేరిన‌ట్టు స‌మాచారం.

ప‌వ‌న్ – క్రిష్ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో జ‌రుగుతోంది. ఈ సంద‌ర్భంగా ప‌లుమార్లు ప‌వ‌న్ ని క‌లిశాడ‌ట వంశీపైడిప‌ల్లి. `మ‌హ‌ర్షి` త‌ర‌వాత‌.. వంశీ పైడిప‌ల్లి సినిమా ఎవ‌రితో అన్న‌ది ఇంకా ఖ‌రారు కాలేదు. కొంత‌మంది నిర్మాత‌ల‌తో కమిట్‌మెంట్స్ ఉన్నాయి గానీ, హీరో మాత్రం దొర‌క‌డం లేదు. ప‌వ‌న్ అయితే ఇప్పుడు ఫుల్ బిజీ. త‌న‌కున్న బిజీ షెడ్యూల్ లో కొత్త క‌థ‌లు వినేంత స్కోప్ లేదు. అయినా స‌రే.. వంశీ ప‌వ‌న్ చుట్టూ వైఫైలా తిరుగుతున్నాడ‌ని టాక్. ప‌వ‌న్ మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్ప‌లేం. ఓకే అన్నా అనేస్తాడు. అనేసినా.. వంశీ క‌నీసం రెండేళ్ల‌యినా ఆగాలి. ప‌వ‌న్ త‌న‌తో ఇప్ప‌టికిప్పుడు సినిమా చేయ‌క‌పోయినా.. క‌నీసం మాటిస్తే – భ‌విష్య‌త్తులో సినిమా సెట్ చేసుకోవొచ్చ‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టున్నాడు వంశీ. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీలో తిరుగుబాటు వార్తలు..! సజ్జల వివరణ..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు అంటూ రిపబ్లిక్ టీవీలో వచ్చిన ఓ కథనం ఇప్పుడు వైసీపీలో అలజడి రేపుతోంది. ఎంతగా అంటే.. ఆ పార్టీకి జగన్ తర్వాత జగన్ అంతటి వ్యక్తిగా బరువు,...

స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆగదని కేంద్రంతో చెప్పించిన వైసీపీ ఎంపీలు..!

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి తమ వద్ద ప్రత్యేకమైన ప్రణాళిక ఉందని చెబుతున్న వైసీపీ నేతలు... ఢిల్లీ నుంచి మాత్రం ఏపీకి స్టీల్ ప్లాంట్‌తో సంబంధం లేదనే ప్రకటనలు...

తెలంగాణ మహిళల గురించి సరే….షర్మిల తన హక్కుల కోసం ఎలా పోరాడుతారు..!?

తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టి.. రాజన్న రాజ్యం తీసుకు వచ్చి.. అందరికీ న్యాయం చేసేయాలన్న పట్టుదలతో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని కూడా ఉపయోగించుకున్నారు. పెద్ద...

చంద్రబాబు బూతులు మాట్లాడుతున్నారంటున్న సజ్జల..!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారాలు కానీ.. రాజకీయ విమర్శలు కానీ బూతుల రేంజ్‌లో ఎవరు చేస్తారు..? అంటే ప్రత్యేకంగా సమాధానం వెదుక్కోవాల్సిన అవసరం లేదు. అయితే అదే వైసీపీ నేతలు ఇప్పుడు.. చంద్రబాబు, లోకేష్...

HOT NEWS

[X] Close
[X] Close