అయోమ‌యంలో వంశీ పైడిప‌ల్లి

`ఆర్‌.ఆర్‌.ఆర్‌` త‌ర‌వాత రాజ‌మౌళి సినిమా ఏమిట‌న్న‌ది తేలిపోయింది. మ‌హేష్ బాబుతో ఓ సినిమా ఖాయ‌మైంది. 2021 ప్రారంభంలో `ఆర్‌.ఆర్‌.ఆర్‌` విడుద‌ల కానుంది. ఈలోగా… ప‌ర‌శురామ్ సినిమాని పూర్తి చేస్తాడు మ‌హేష్ బాబు. మ‌రి మ‌ధ్య‌లో వంశీపైడిప‌ల్లి ప్రాజెక్టు ఒక‌టుంది.

నిజానికి ‘సరిలేరు నీకెవ్వ‌రు’ త‌ర‌వాత వంశీ సినిమానే మొద‌ల‌వ్వాలి. క‌థ విష‌యంలో మ‌హేష్‌కి కొన్ని అనుమానాలు ఉండ‌డంతో.. ఆ ప్రాజెక్టు ప‌క్క‌కెళ్లింది. ‘ప‌ర‌శురామ్ త‌ర‌వాత మీదే…’ అంటూ వంశీకి మ‌హేష్ మాట ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. అందుకే వంశీ పైడిప‌ల్లి కూడా మ‌హేష్ క‌థ‌పై క‌స‌ర‌త్తులు మ‌రింత ముమ్మ‌రం చేశాడు.

ఎప్పుడైతే రాజ‌మౌళి సినిమా ఖాయ‌మైందో, అప్పుడే వంశీ పైడిప‌ల్లి ప్రాజెక్టుపై మ‌ళ్లీ అనుమానాలు మొద‌ల‌య్యాయి. ప‌ర‌శురామ్ సినిమాకీ, రాజ‌మౌళి సినిమాకీ పెద్ద‌గా గ్యాప్ లేదు. దాంతో వంశీ పైడిప‌ల్లి సినిమా ప‌క్క‌కెళ్లే ప్ర‌మాదం ఎదుర్కొంటోంది. ఇప్పుడు మ‌హేష్ బాబు ద‌గ్గ‌ర రెండు ఆప్ష‌న్లు ఉన్నాయి. ప‌ర‌శురామ్ ప్రాజెక్టుని వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేయాలి. ఆ వెంట‌నే వంశీ పైడిప‌ల్లి సినిమా మొదలెట్టాలి. రాజ‌మౌళి తో సినిమా 2021 వేస‌విలో ప్రారంభం అవుతుంద‌నుకుంటే… ఈలోగా రెండు సినిమాల్ని పూర్తి చేయ‌గ‌ల‌గాలి. అయితే సినిమా సినిమాకీ గ్యాప్ తీసుకుని, ఆ విరామంలో కుటుంబంతో గ‌డిపేందుకు ప్లాన్ చేసే మ‌హేష్‌… కుటుంబం కోసం ఇచ్చే స‌మ‌యాన్ని వంశీ పైడిప‌ల్లి కోసం వ‌దులుకుంటాడా అనేది ప్ర‌శ్నార్థ‌కం. లాక్ డౌన్ స‌మ‌యంలో మహేష్ కూడా కొత్త సినిమాల గురించి ఏమాత్రం ఆలోచించ‌డం లేదు. అస‌లు.. ప‌ర‌శురామ్‌నే మ‌హేష్ తొంద‌ర పెట్ట‌డం లేద‌ని తెలుస్తోంది. లాక్ డౌన్ ఎత్తేయాలి, ప‌ర‌శురామ్ సినిమా మొద‌ల‌వ్వాలి, అది పూర్త‌వ్వాలీ.. ఆ త‌ర‌వాతే క‌దా వంశీ సినిమా గురించి ఆలోచించాలి. సో.. ఇదంతా వంశీ పైడిప‌ల్లిలో అయోమ‌యానికి గురి చేస్తోంది.మ‌హేష్‌ని న‌మ్ముకుని ఉండిపోవాలా? లేదంటే మ‌రో హీరోని ట్రాక్ లో దించాలా? అనే విష‌యం ఎటూ తేల్చుకోలేక‌పోతున్నాడు వంశీ.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బిగ్ బాస్ నుండి దేవి నిష్క్రమణ, టీవీ9 పై జనాల్లో వ్యతిరేకత కూడా కారణమా ?

బిగ్ బాస్ సీజన్ 4 రికార్డు టిఆర్పీ లతో దూసుకెళుతోంది. కంటెస్టెంట్స్ జాబితా బాగోలేదు అన్న కారణంగా రెండు మూడు రోజుల తర్వాత పడిపోయిన రేటింగులు 10వ రోజు నుండి భారీగా పుంజుకున్నాయి....

పవన్ కళ్యాణ్ ఈనాడు ఇంటర్వ్యూ పై సాక్షి కొమ్మినేని ఏడుపు, ఈనాడు కి నీతులు

ఇటీవల పవన్ కళ్యాణ్ ఈనాడు పత్రికకు ఇచ్చిన సుదీర్ఘమైన ఇంటర్వ్యూ రాజకీయంగా ప్రాముఖ్యత సంతరించుకుంది. అమరావతి, జగన్ పాలన, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల పై పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాలను ఆ...

గ్రేటర్ సమస్యలపై కేటీఆర్‌ని టార్గెట్ చేస్తున్న రేవంత్..!

తెలంగాణలో గ్రేటర్ ఎన్నికల రాజకీయం రాజుకుంది. ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో అంచనా వేయడం కష్టం కానీ.. రాజకీయ నేతలు మాత్రం.. వచ్చిన ఏ అవకాశాన్ని వదిలి పెట్టడం లేదు. గ్రేటర్ పరిధిలో...

ఠాగూర్ అయినా టీ కాంగ్రెస్‌లో అందర్నీ కలపి ఉంచగలరా..!?

తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జిగా కుంతియా స్థానంలో మాణిగం ఠాగూర్‌ను కాంగ్రెస్ హైకమాండ్ నియమించింది. ఆయన తెలంగాణలో అడుగు పెట్టి..ఓ సారి సమావేశం కూడా నిర్వహించారు. కాంగ్రెస్ నేతలు.. అందరూ ఆయన ఎదుట...

HOT NEWS

[X] Close
[X] Close