మ‌హేష్‌పై ఆశ వ‌దులుకోని వంశీ

స‌రిలేరు నీకెవ్వ‌రు త‌ర‌వాత మ‌హ‌ర్షి కాంబినేష‌న్ రిపీట్ అవ్వాల్సింది. కాని కొన్ని కార‌ణాల వ‌ల్ల‌… ఆ సినిమా ఆగిపోయింది. వంశీ పైడిప‌ల్లి మ‌హేష్ కోసం ఓ క‌థ త‌యారు చేసుకున్నా, అది మ‌హేష్ అంచ‌నాల‌కు త‌గిన‌ట్టుగా రాక‌పోవ‌డంతో ఆ సినిమాని మ‌హేష్ ప‌క్క‌న పెట్టేశాడు. చిరంజీవి 152 వ చిత్రంతో మ‌హేష్ త్వ‌ర‌లోనే బిజీ కాబోతున్నాడు. ప‌ర‌శురామ్‌, అనిల్ రావిపూడి.. ఈ ఇద్ద‌రూ మ‌హేష్ కోసం కొత్త క‌థ‌లు సిద్ధం చేస్తున్నారు.

అయితే… వంశీ మాత్రం మ‌హేష్ సినిమాపై ఆశ‌లు వ‌దులుకోలేదు. `మా కాంబోకి కాస్త బ్రేక్ వ‌చ్చిందంతే. క‌థ కుదురుకోగానే ప‌ట్టాలెక్కుతుంది` అంటూ స‌న్నిహితుల ద‌గ్గ‌ర న‌మ్మ‌కంగా చెబుతున్నాడ‌ట‌. మ‌హేష్ కూడా వంశీతో అదే చెప్పాడ‌ట‌. `మ‌న కాంబోలో సినిమా ఉంది. కానీ కాస్త ఆల‌స్యం అవుతుందంతే`అని ధైర్యం చెప్పాడ‌ట‌. చిరంజీవి 152వ సినిమాలో మ‌హేష్ న‌టించ‌డం నిజ‌మే అయితే.. ఆ సినిమా కోసం త‌ను 30 రోజుల కాల్షీట్లు ఇవ్వాల్సివ‌స్తుంది. ఈలోగా వంశీ స‌రైన క‌థ చెప్ప‌గ‌లిగితే.. ఆ సినిమా ప‌ట్టాలెక్క‌డం ఖాయం. బ‌హుశా… వంశీ ధైర్యం కూడా అదే కావొచ్చు. వంశీ లాంటి ద‌ర్శ‌కుడికి `నో`చెప్ప‌డం మ‌హేష్‌ని కాస్త ఇబ్బంది పెట్టే విష‌య‌మే. ఓ ద‌ర్శ‌కుడిగా కాకుండా, ఓ స్నేహితుడిగా వంశీ మ‌హేష్‌కి ద‌గ్గ‌ర‌య్యాడు. ఈ నేప‌థ్యంలో వంశీకి వెన్నుద‌న్నుగా నిల‌వాల‌నుకుంటున్నాడు మ‌హేష్‌. ఈ చిత్ర‌సీమ‌లో ఏదైనా జ‌ర‌గొచ్చు. ప‌ట్టాలెక్కాల్సిన సినిమా ఆగిపోవొచ్చు. ఆగి పోయిన సినిమా మొద‌ల‌వ్వొచ్చు. వంశీ న‌మ్మ‌కం కూడా అదే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బాలు స్వరం వజ్రం.. ఎప్పటికీ నిలిచి ఉంటుంది..!

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణించారా..? నో.. నెవ్వరు..! ఎక్కడ చూసినా ఆయన గొంతే వినిపిస్తూంటే ఆయన లేరని చెప్పడానికి నోరెలా వస్తుంది..?. ఇప్పుడు కాదు..పుట్టినప్పటి నుండి ఊహ తెలిసినప్పటి నుండి.. రెడియోల్లో పాటలు...

దుబ్బాక రేసు ప్రారంభించేసిన నేతలకు ఈసీ షాక్..!

దుబ్బాక ఉపఎన్నికకు షెడ్యూల్ వచ్చేస్తుందని పరుగులు పెడుతున్న రాజకీయ పార్టీలకు ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించింది కానీ ఉపఎన్నికలను నిర్వహించాలని మాత్రం నిర్ణయించుకోలేదు. కొద్ది రోజుల...

క‌న్నీటి ప‌ర్యంత‌మైన సిరివెన్నెల‌

బాలు మృతిని సినీ రంగం జీర్ణించుకోలేక‌పోతోంది. మ‌రీ ముఖ్యంగా.. ఆయ‌న సన్నిహితులు, స్నేహితులు, సాహితీకారులు. బాలుని ప్రేమ‌గా `అన్న‌య్యా` అని పిలుచుకునే సిరివెన్నెల మాత్రం బోరున విల‌పించారు. `తెలుగు సినిమా పాట‌ల మాస్టారు...

బాలు.. స‌క‌ల క‌ళా వ‌ల్ల‌భుడు

బాలుని ఏమ‌ని వ‌ర్ణించాలి? ఆయ‌న‌లోని ప్ర‌తిభ‌ని ఎంత‌ని చెప్పాలి? బాలు ని కేవ‌లం ఓ గాయ‌కుడిగానే చూళ్లేం. ఆయ‌న అంత‌కు మించి. ఆయ‌న‌లో సంగీత ద‌ర్శ‌కుడు, డ‌బ్బింగ్ క‌ళాకారుడు, న‌టుడు,...

HOT NEWS

[X] Close
[X] Close