టీడీపీలో చేరికపై వంగవీటి డైలమా..!?

ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పెద్ద మనిషిలా ఆయన ఆహ్వానించారు.. కానీ మన్నించండి..మరో అనుకోవద్దు.. అంటూ వ్యాఖ్యానించడంతో.. ఆయన టీడీపీలో చేరబోవడం లేదనే చర్చ ప్రారంభమయింది. మీడియా ముందుకు వచ్చి వైసీపీకి ఎందుకు రాజీనామా చేశానో చెప్పినప్పటికీ.. ఏ పార్టీలో చేరబోతున్నది మాత్రం స్పష్టంగా చెప్పలేదు. అందుకే వంగవీటి రాధాకృష్ణ రాజకీయ పయనంపై… చర్చోపచర్చలు ప్రారంభమయ్యాయి. వైసీపీలో చాలా కాలంగా నిరాదరణకు గురవుతున్నప్పటికీ.. ఆ పార్టీ నుంచి నాలుగు రోజుల కిందటే వైదొలిగారు. విజయవాడ నగరంలోని పేదలందరికీ.. ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నది తన తండ్రి ఆశయమని.. ఆ ఆశయ సాధనకు కృషి చేస్తానని ప్రకటించారు… ఏ పార్టీలోనూ చేరకుండా… వంగవీటి రాధాకృష్ణ.. తన తండ్రి ఆశయాన్ని సాధించడం సాధ్యం కాదు. ఎందుకంటే… ప్రభుత్వంతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి.. ప్రభుత్వంలో భాగంగా ఉంటేనో.. అధికారంలో ఉన్న పార్టీతో కలసి నడిస్తేనే అది సాధ్యం. కానీ వంగవీటి మాత్రం భిన్నంగా స్పందించారు. తన ప్రజాజీవితం కొనసాగుతుందంటున్నారు కానీ.. ఏదైనా పార్టీలో చేరుతానని మాత్రం చెప్పడం లేదు.

తెలుగుదేశం పార్టీలో చేరుతారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, ఎమ్మెల్సీ టీడీ జనార్ధన్ .. వంగవీటి రాధాకృష్ణ నివాసానికి వచ్చి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీలో చేరిక వార్తల్ని గట్టిగా రాధాకృష్ణ ఖండించకపోవడంతో.. అంతా నిజమేననుకున్నారు. మీడియా సమావేశంలో కూడా ఆయన తెలుగుదేశం పార్టీపై చాలా సానుకూల ధోరణి చూపించారు. వంగవీటి రంగా హత్యకు టీడీపీ కారణమని.. ఆ పార్టీలో ఎలా చేరుతారంటూ కొంత మంది మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు..ధీటుగానే సమాధానం చెప్పారు. వంగవీటి రంగా అభిమానులు అన్ని పార్టీల్లోనూ ఉన్నారన్నారు. కొంత మంది వ్యక్తులు చేసిన పని పార్టీపైకి నెట్టడం సరికాదన్నారు. గతంలో తాను కాంగ్రెస్ లో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. తన తండ్రి కమ్యూనిస్టులతో పోరాడారని.. కులాలపై కాదన్నారు. రంగాపై కులం ముద్ర వేయడాన్ని కూడా తీవ్రంగా ఆక్షేపించారు. టీడీపీ కాకపోతే.. వంగవీటి రాధాకు జనసేన ఒక్కటే ఆప్షన్ గా కనిపిస్తోంది. కానీ జనసేన వైపు నుంచి కానీ.. వంగవీటి వర్గీయుల నుంచి కానీ.. ఎలాంటి చర్చలు జరుగుతున్న సమాచారం లేదు.

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో చాలా కాలం నుంచి పని చేసుకుంటున్న వంగవీటి.. ఇండిపెండెంట్ గా పోటీ చేసి.. తండ్రి ఆశయ సాధన కోసం ప్రయత్నిస్తారన్న అంచనా కూడా ఉంది. ఎందుకంటే.. తెలుగుదేశం పార్టీలో కూడా.. విజయవాడ సెంట్రల్ లో.. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. అందుకే.. ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. కానీ.. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి తీరాలనే సంకల్పంతో.. రాధాకృష్ణ ఉన్నందునే.. టీడీపీ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించినట్లుగా .. మాట్లాడారని చెబుతున్నారు. అయితే రంగా ఆశయ సాధనకు చంద్రబాబు హామీ ఇస్తారని.. ఇప్పటికే.. విజయవాడ ప్రజలకు పెద్ద ఎత్తున ఇళ్లు కట్టించి ఇచ్చే పథకాలు అమలవుతున్నాయని.. వంగవీటి.. ప్రతిపాదనను.. సమగ్రంగా పరిశీలించి.. ఇళ్లు మంజూరు చేస్తారని.. ఆ తర్వాత టీడీపీలో చేరుతారన్న ప్రచారం కూడా ఉంది. దీనిపై వంగవీటి ఏం చేయబోతున్నారన్నదానిపై.. రెండు, మూడు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాంగ్రెస్‌తో కాదు రేవంత్ తోనే బీజేపీ, బీఆర్ఎస్ పోటీ !

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ తో కాకుండా రేవంత్ తో పోటీ పడుతున్నట్లుగా రాజకీయాలు చేస్తున్నారు. రేవంత్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఏమీ...

ప్రచారంలో పొలిటికల్ గ్లామర్ ఏదీ..?

ఎన్నికలు అనగానే ప్రధాన పార్టీలు సినీ తారల సేవలను ప్రచారంలో ఒకప్పుడు వాడుకునేవి. కానీ, రానురాను ఆ సంప్రదాయం తెరమరుగు అవుతోంది. తమ సేవలను వాడుకొని వదిలేస్తున్నారనే భావనతో ప్రచారాలకు దూరం పాటిస్తున్నారు....

ఎవరీ రామసహాయం రఘురామ్ రెడ్డి..?

ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా రామసహాయం రఘురాం రెడ్డిని హైకమాండ్ ప్రకటించింది.అనేకపేర్లు తెరమీదకు వచ్చినా అనూహ్యంగా అధిష్టానం రామసహాయం పేరును అభ్యర్థిగా ఖరారు చేయడంతో ఈయన ఎవరు అనే చర్చ జోరుగా జరుగుతోంది....

“సివిల్ సర్వీస్” ఇమేజ్ జగన్ పాలనలో డ్యామేజ్ !

సివిల్ సర్వీస్ అధికారి అంటే ఓ గౌరవం.. ఓ మర్యాద. కానీ ఏపీలో సివిల్ సర్వీస్ అధికారులు చేస్తున్న పనులు చూసి.. కోర్టులు కూడా అసలు మీకెవరు ఉద్యోగం ఇచ్చారయ్యా అని అసహనపడాల్సి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close