వాన్ పిక్ భూములు ‘కుట్టిన’ చంద్రబాబు

‘వాన్ పిక్’ (వాడరేవు మరియు నిజాం పట్నం పోర్ట్స్‌ ఇండిస్టియల్‌ కారిడార్‌ ప్రాజెక్ట్‌)వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వం పాత్ర ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో వాన్‌పిక్‌ పదేళ్ళక్రితం అతిపెద్ద అభివృద్ధి కేంద్రం. తర్వాత జగన్ అక్రమ ఆర్జనల్లో అతి పెద్ద కుంభకోణం. ఇప్పుడు ఎవరికీ పట్టని త్రిశంకుస్వర్గం. నిత్యం కూరగాయలు పండించుకునే భూములతో పాటు సరుగుడు తోటలు సాగు చేస్తున్న భూములన్నీ ఇప్పుడు ఏపరిశ్రమా ఏర్పాటుకాక పదేళ్ళుగా బీడుభూములైపోయాయి. మొత్తం 4 వేలఎకరాల ప్రయివేటు భూముల్లో పొలాలు వదలిపోయిన పేదరైతులు కూలీలుగా వలసలు పోయారు. మధ్యతరగతిరైతులు పెద్దరైతులకు కౌలుదారులయ్యారు. పెద్దరైతులైతే వాన్ పిక్ కు ఇచ్చేసిన భూములను కూడా తామే సాగు చేసుకుంటున్నారు. రొయ్యల సాగుకూడా ఆభూముల్లో వుంది.

ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో 13 వేల ఎకరాల ‘వాన్ పిక్’ కోసం రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం రైతులనుంచి స్వాధీనం చేసుకున్న 4 వేల ఎకరాల భూములను రైతులకు వాపసు ఇవ్వాలని ప్రతిపక్షనాయకుడిగా పాదయాత్ర చేసినపుడు డిమాండ్ చేసిన చంద్రబాబు ఇపుడు ఏమీ మాట్లాడటం లేదు. ఈ వ్యవహారంలో ప్రభుత్వ విధానం లేదా నిర్ణయం కోసం భూములిచ్చిన రైతులు ఎదురుచూస్తున్నారు. వాన్ పిక్ ప్రాజెక్టు వల్ల మోటుపల్లిలో పోర్టు వస్తుందని, పోర్టు ఆధారిత పరిశ్రమలు వస్తాయని నమ్మించారు. ఎనిమిదేళ్ల క్రితం ప్రజల నుండి బలవంతంగా భూములు స్వాధీనం చేసుకున్నారు. పదేళ్లలో తీరంలో పరిశ్రమలు వెలుస్తాయని, అప్పుడు ఎవ్వరూ పొమ్మనకుండానే కాలుష్యం తట్టుకోలేక మీరే వెళ్లాల్సి వస్తుందని అప్పటి జిల్లా యంత్రాంగం ఆయా గ్రామాల ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి మరీ భూములు లాక్కుంది.

భూ సేకరణలో అక్రమాలు జరిగాయని అప్పట్లో ఆందోళనలు జరిగాయి. సిబిఐ విచారణ జరిగింది. అసైన్‌మెంట్‌ భూములను, అటవీ శాఖ భూములను వాన్‌పిక్‌కు అప్పగిస్తూ అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాల ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వ భూములతో పాటు రైతుల పట్టా భూములను కూడా స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వ విలువ ప్రకారం ఎకరాకు రూ.3లక్షల నుండి రూ.7లక్షల వరకూ రైతులకు చెల్లించినట్లు రికార్డుల్లో రాసుకున్నారు. అయితే వాస్తవంగా రైతులకు రూ.3లక్షలలోపే ఇచ్చినట్లు సిబిఐ విచారణలో తేలింది. దీంతో కేంద్ర ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం అధికారులు మోటుపల్లి గ్రామ పరిధిలోని 540 ఎకరాల భూమిని తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆయా భూముల్లో సర్వే నంబర్లతో సహా బోర్డులను ఏర్పాటు చేశారు.

VANPIC

తమనుంచి బలవంతంగా లాగేసుకున్న భూమి, ప్రాజెక్టే ప్రారంభం కాక బీడైపోయింది. ఒకనాటి ఆపొలాల యజమానుల కడుపురగిలిపోతోంది. ఒకప్పుడు రైతుపక్షాన నిలచిన ప్రస్తుత ముఖ్యమంత్రి వాన్ పిక్ కి ఏం పరిష్కారం ఇస్తారా అన్నది రాజధానికి భూముల సేకరణ వివాదంలో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. వాన్ పిక్ పై రాష్ట్రప్రభుత్వం ఏనిర్ణయమూ తీసుకోకపోతే రాజధాని భూముల గతీ ఇంతే నన్న విమర్శలు ఎదుర్కోవలసి వుంటుంది. అయితే ప్రధానప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ కు దీనిపై విమర్శ కు ఆస్కారమే లేదు. ఎందుకంటే ఇందులో జగన్ దోషి. ఎన్నికల ప్రచారం నాటి డిమాండ్ ప్రకారం భూములు వాపసు ఇవ్వాలంటే అన్ని సెజ్ లకు భూములు ఇచ్చిన రైతులనుంచి ఇదేడిమాండ్ వస్తుంది.

ఈ కుంభకోణంలో జగన్ తోపాటు అప్పటి మంత్రి మోపిదేవి వెంకటరమణ, మాటివి (నిమ్మగడ్డ) ప్రసాద్ జైలుకి కూడా వెళ్ళరు. ఆసమయంలోనే తాము ఇచ్చేసిన భూములను తిరిగి ఆక్రమించుకోడానికి రైతులు ఉద్యమించారు. చంద్రబాబు రైతుల డిమాండుని నెరవేర్చవల్సిందేనని సభల్లో డిమాండ్ చేశారు

ఎలాగైనా గెలిచేయాలని ముందూ వెనకా ఆలోచించకుండా హామీలు ఇచ్చేయడం వల్లే వాన్ పిక్ భూముల వ్యవహారం చంద్రబాబు పాలిట ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టు పరిణమించింది. వాన్ పిక్ కు భూముల సేకరణ తప్పు అయితే రాజధానికి భూముల సేకరణ కూడా తప్పే అని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెగేసి చెప్పినా ఏ స్పందనా లేదంటే అది వాన్ పిక్ భూములు ‘కుట్టిన’ చంద్రబాబు బాధ అని అర్ధం చేసుకోవాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వెట్రిమార‌న్‌తో సినిమా చేయాల‌ని ఉంది: ఎన్టీఆర్‌

ఎన్టీఆర్‌తో సినిమా చేయ‌డానికి పెద్ద పెద్ద క‌మ‌ర్షియ‌ల్ ద‌ర్శ‌కులు ఎదురు చూస్తున్నారు. అయితే ఎన్టీఆర్ మ‌న‌సులో మాత్రం.. ఓ దర్శ‌కుడు ప్ర‌త్యేక స్థానాన్ని ఆక్ర‌మించుకొన్నాడు. త‌న‌తో సినిమా చేయాల‌ని ఎన్టీఆర్ ఆస‌క్తి చూపిస్తున్నాడు....

సీఎంఆర్ఎఫ్‌కే మేకపాటి విరాళం – జగన్ ఊరుకుంటారా ?

సీఆర్ఆర్ఎఫ్‌కు ఎవరూ విరాళాలు ఇవ్వవద్దని వైసీపీ నేతలు .. తమ వారు అందరికీ సమాచారం పంపారు. అందుకే కొంత మంది చెక్కులు తెచ్చి జగన్ కే ఇచ్చారు. అయితే జగన్ మాటను లెక్క...

నెక్ట్స్ వివేకా కేసులో గీత దాటిన వైపీఎస్‌లే !

ఐపీఎస్‌లు అనే పదానికి అర్థం మార్చేసి వైపీఎస్‌ల తరహాలో చెలరేగిపోయిన అధికారులకు ఇప్పుడు తాము ఎంత తప్పు చేశామో తెలిసే సమయం వచ్చింది. ప్రభుత్వం మారగానే వారు చేసిన తప్పులన్నీ మీద పడిపోతున్నాయి....

కాంగ్రెస్ లో కొత్త షార్ట్ కట్… వర్కింగ్ టు కింగ్.. !

తెలంగాణ కాంగ్రెస్ లో పదవుల గోల ఎప్పుడూ ఉండేదే.. ఇప్పుడూ అదే జరుగుతోంది. ఒకప్పుడు ఇస్తే పీసీసీ ఇవ్వండి..అంతేకాని ప్రాధాన్యత లేని వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ అక్కర్లేదు అంటూ పెదవి విరిచిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close