కేసీఆర్ ను ఓడించడానికి హరీష్ స్కెచ్..! ప్రతాప్ రెడ్డికి ఆఫర్ ఇచ్చారట..!!

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను… హరీష్ రావు ఓడించాలనుకుంటున్నారా..? అవసరమైన ఆర్థిక సాయం కూడా… కాంగ్రెస్ అభ్యర్థికి చేస్తానన్నారా..?. అవుననే అంటున్నారు… గజ్వేల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్తి వంటేరు ప్రతాప్ రెడ్డి. ఎలాగైనా తన మామ, సీఎం కేసీఆర్‌ను ఓడించాలని హరీశ్‌ శుక్రవారం తనకు ఓ ప్రైవేట్‌ ఫోన్ నుంచి ఫోన్ చేసి కోరారంటున్నారు. అన్ని బాధ్యతలను కేటీఆర్‌కే అప్పగిస్తూ కేసీఆర్‌ తన ఇజ్జత్ తీస్తున్నారని, ఆయన వైఖరితో తనకు రాజకీయ జీవితం లేకుండా పోతోందని హరీశ్‌ చెప్పినట్లు ప్రతాప్‌ రెడ్డి తెలిపారు. కేసీఆర్‌ను ఓడించేందుకు కలిసి పనిచేద్దామన్నారట. ఆర్థికసాయం అందిస్తానని హరీశ్‌ చెప్పారని.. అవినీతి సొమ్ము తనకు వద్దని తిరస్కరించానన్నారు. తనకు గజ్వేల్‌ ప్రజలు, యువత అండగా ఉన్నారని, కేసీఆర్‌ కుటుంబం మొత్తం వచ్చి ప్రచారం చేసినా విజయం తనదేనని ప్రతాప్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై ఏ దేవుడిపైనైనా ప్రమాణం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. రాహుల్ గాంధీతో హరీష్ రావు టచ్ లో ఉన్నారని కూడా చెప్పుకొచ్చారు.

ప్రతాప్ రెడ్డి వ్యాఖ్యలు టీఆర్ఎస్ కలకలం రేపుతున్నాయి. కొంత కాలంగా… హరీష్ రావును.. టీఆర్ఎస్ వ్యవహారాల్లో దూరం పెడుతున్నారు. కొన్నాళ్ల పాటు.. హరీష్ రావు కార్యక్రమాలు.. టీఆర్ఎస్ సొంత మీడియాలో కూడా రాలేదు. అయినా హరీష్ రావు.. టీఆర్ఎస్ తరపున ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గానే పాల్గొంటున్నారు. గజ్వేల్ బాధ్యతలను నిన్నామొన్నటి వరకూ ఆయనే చూశారు. అయితే .. వరసుగా.. టీఆర్ఎస్ నేతలంతా.. కాంగ్రెస్ పార్టీలో చేరిపోతూండటంతో… కేసీఆర్ కొత్తగా.. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని గజ్వేల్ కు పంపించారు. ఇప్పుడు గజ్వేల్ బాధ్యతలు… కొత్త ప్రభాకర్ రెడ్డి చూసుకుంటున్నారు. ఆయన వచ్చిన తర్వాత కూడా… మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో గజ్వేల్ లో ఏం జరుగుతోందన్న చర్చ తెలంగాణ రాజకీయాల్లో ప్రారంభమయింది.

హరీష్ రావును దూరం పెడుతూండటానికి కారణం.. ఫోన్ ట్యాపింగ్ లో రహస్యాలు ఏవో బయటకు వచ్చాయన్న ప్రచారం కొన్నాళ్లు సాగింది. ఇప్పుడు నేరుగా… ప్రతాప్ రెడ్డినే కేసీఆర్ ను ఓడించడానికి హరీష్ ప్రయత్నిస్తున్నారనే చెప్పడం… కలకలం రేపుతోంది. ఇది నిజమో కాదో కానీ.. హరీష్ రావుకు మాత్రం మరిన్ని చిక్కులు తెచ్చి పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే హరీష్ కోసం… ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి రంగంలోకి దిగారు. ప్రతాప్ రెడ్డి.. హరీష్ పై చేసిన వ్యాఖ్యలను నిరూపించాలని సవాల్ చేశారు. నిరూపిస్తే ప్రాణత్యాగం చేసుకుంటానన్నారు. నిరూపించలేకపోతే.. ఏం చేసుకుంటావో చెప్పాలన్నారు. కానీ ఈ సవాళ్లు సెకండరీనే… ప్రతాప్ రెడ్డి చెప్పినవే.. జనం లోకి వెళ్లి పోయాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close