మహేష్ ‘శ్రీమంతుడు’పైన బాహుబలి ఎఫెక్ట్ : వర్మ

హైదరాబాద్: రాంగోపాల్ వర్మ ఎందుకో ఈ మధ్య మహేష్‌ను టార్గెట్ చేశాడు. ఆగడు సినిమా సందర్భంలో ఆ సినిమాపై, దర్శకుడు శ్రీను వైట్లపై వ్యంగంగా ట్వీట్ చేసిన వర్మ, ఇవాళ బాహుబలి చిత్రంపై స్పందిస్తూకూడా మహేష్‌పై విసుర్లు విసిరాడు. బాహుబలి అసలు ప్రభావం తర్వాత విడుదల కాబోతున్న పెద్ద హీరో సినిమాపై పడబోతుందని వ్యాఖ్యానించాడు. బాహుబలి ఆ హీరో ఐశ్వర్యాన్ని తగ్గిస్తుందంటూ పరోక్షంగా మహేష్ తర్వాతి సినిమా ‘శ్రీమంతుడు’ గురించి ప్రస్తావించారు. శ్రీమంతుడు ఆగస్టు 7వ తేదీన విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.

మరోవైపు బాహుబలిని వర్మ విపరీతంగా పొగిడేశాడు. సింహాలు, పులులు, ఏనుగులు ఉన్న ఈ ఇండస్ట్రీలోకి బాహుబలి డైనోసార్ లాగా వచ్చిందని, దీంతో గతంలో ఉన్న పాలన మారబోతోందని వ్యాఖ్యానించాడు. ప్రభాస్ నటన అద్భుతమని, ఇక రానా విగ్రహ పరంగా, నటన పరంగా శిఖరస్థాయికి చేరాడని అన్నాడు. రాజమౌళి ఇక్కడ పుట్టటం తెలుగువారికి గర్వకారణం, బాంబేలోనో, లాస్ ఏంజల్స్‌లో పుట్టకపోవటం అతని దురదృష్టమంటూనే, అతను ఒరిస్సాలో, అస్సాంలో, టింబక్టూలో పుట్టినా అతను రాజమౌళిగానే ఉంటాడని, తెలుగువారు దానిగురించి అంత సెక్సైట్ కానవసరంలేదని విలక్షణ వ్యాఖ్యలు చేశాడు. బాహుబలి చిత్రం పెద్ద పెద్ద స్టార్‌లకు ఒక మేలుకొలుపు కావాలని వర్మ అన్నాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close