మీడియా, సోషల్ మీడియాలో అంతా అఘోరి గురించే చర్చ. 23ఏళ్ల వర్షిణితో అఘోరి పెళ్లి ప్రయాణం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. వర్షిణి తమ దగ్గరకు వచ్చేయలని తల్లిదండ్రులు కోరుతున్నారు. తమ కూతురిని అఘోరి ట్రాప్ చేశారని, అందుకే అలా మూర్ఖంగా మాట్లాడుతోంది అని ఆరోపిస్తున్నారు. మేజర్ అయినా తెలిసి తెలియని వయస్సును అఘోరి తన స్వార్ధం కోసం వర్షిణి గొంతు కొస్తున్నాడని వాపోతున్నారు.
ఇటీవల తల్లిదండ్రుల వద్దకు వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు కనిపించిన వర్షిణి.. తర్వాత నాలుక మడతేసింది. తాను అఘోరితోనే ఉంటానని, మూడోసారి అఘోరిని పెళ్లి చేసుకుంటానని ఓ ఛానెల్ డిబేట్ లో స్పష్టం చేసింది. తన తుదిశ్వాస వరకు అఘోరితోనే ఉంటానని , తన నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని తేల్చిచెప్పింది. తన తల్లిదండ్రులు తమతో ఉండవచ్చునని, తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, తను మాత్రం అఘోరిని విడిచిపెట్టేది లేదని చెప్పింది.
డిబేట్ లో యాంకర్ వర్షిణిని ఎంత కన్విన్స్ చేసేందుకు ప్రయత్నించినా వర్షిణి తగ్గలేదు. సరికదా కొత్త పాఠాలు చెప్పింది. అట్రాక్షన్ కు లోనై భవిష్యత్ లో ఇబ్బందులు ఎదుర్కొంటావని చెప్పినా వినలేదు. ఇది చూసినా చాలామందికి అఘోరిపై ఆగ్రహం కట్టలు తెచ్చుకునేలా ఉంది. మొదట అఘోరిని కొంతమంది అభిమానించారు. ఆరాధించారు. కానీ, వర్షిణి ఎపిసోడ్ లో అఘోరి వ్యవహరిస్తున్న తీరు సమర్ధనీయంగా లేదు. దేవదూతగా ప్రోజెక్టు చేసుకుంటూ..ఇప్పుడు వర్షిణితో పెళ్లి అనడంపై హిందుత్వ సంఘాలు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నాయి. మొత్తం స్వామీజీల వ్యవహరశైలిని అనుమానించే లా అఘోరి తీరు ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఇప్పుడు ఈ విషయంలో అఘోరిని లైట్ తీసుకుంటే స్వామీజీలపై తప్పుడు అభిప్రాయం ఏర్పడుతోంది. ఇది సెన్సిటివ్ అంశమే కావొచ్చు..ఇతరులు స్పందిస్తే రాజకీయ రంగు పులుముకునే అవకాశం ఉంది. అందుకే అఘోరి ఎపిసోడ్ లో స్వామీజీలే స్పందించాలనే వాదనలు వినిపిస్తున్నాయి. మరి ఎవరు ముందుకు వస్తారో చూడాలి