తెలుగు హీరోలకు బాలీవుడ్ మార్కెట్ ఓపెన్ అయ్యింది. మంచి క్రేజ్ వున్న సినిమాలు బాలీవుడ్ లో కూడా విడుదలౌతున్నాయి. ఎదో డబ్బింగ్ సినిమాల కాకుండా సొంతగా గొంతు ఇవ్వడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నారు హీరోలు. మొన్న టైగర్ నాగేశ్వరరావు కోసం హిందీలో స్వయంగా డబ్బింగ్ చెప్పారు రవితేజ. ఇప్పుడు వరుణ్ తేజ్ ఆ బాటలో వెళ్ళారు. ఆపరేషన్ వాలంటైన్ తో హిందీలో అడుగుపెడుతున్నారు వరుణ్ తేజ్. హిందీ, తెలుగు భాషల్లో ఈ సినిమాని తెరకెక్కించారు. హిందీ కోసం వరుణ్ స్వయంగా డబ్బింగ్ చెప్పారు, ఇందుకోసం ప్రత్యేక శ్రద్ధతో నేర్చుకొని మరీ చెప్పారు. వరుణ్ హిందీ డబ్బింగ్ బాగా కుదిరిందని యూనిట్ చెబుతోంది. ఎయిర్ ఫోర్స్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాని తెరకెక్కించారు. తెలుగులో వస్తున్న తొలి ఎయిర్ వార్ మూవీ ఇది. మార్చి 1న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.