ఈ సినిమా ఇండియన్ ఫోర్స్ కి నివాళి : వరుణ్ తేజ్

వరుణ్ తేజ్ కొత్త సినిమా ఖరారైయింది. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ నిర్మాణంలో ఓ సినిమా చేయబోతున్నారు వరుణ్. ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ చిత్రం యధార్ద సంఘటనల ఆధారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపధ్యంలో ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఎంటర్‌టైనర్ వుంటుందని నిర్మాణ సంస్థ వెల్లడించింది. ఈ చిత్రానికి శక్తి ప్రతాప్ సింగ్ దర్శకుడు. నవంబర్ లో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. తెలుగు హిందీ ఏకకాలంలో ఈ సినిమా తెరకెక్కనుంది.

ఈ చిత్రం గురించి వరుణ్ చెబుతూ ”ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్‌గా నటించే అవకాశం రావడం గర్వంగా భావిస్తున్నాను. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్దా, దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్‌లతో చేస్తున్న ఈ చిత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి గొప్ప నివాళిగా వుంటుంది. ఈ చిత్రంలో ఇది వరకు ఎన్నడూ చేయని పాత్రని చేస్తున్నాను. ఒక ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్‌ పాత్ర పోషించడం చాలా ఆసక్తికరంగా వుంది. నా పాత్రలో చాలా లేయర్స్ వుంటాయి. ఈ పాత్రకోసం ప్రత్యేకమైన శిక్షణ పొందాను. ప్రేక్షకులు దీనికి ఎలా స్పందిస్తారో చూడడానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను” అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అయితే హైకోర్టు.. లేకపోతే సుప్రీంకోర్టు – తెలంగాణ సర్కార్ తంటాలు !

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సీబీఐకి వెళ్లకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. సీబీఐకే ఇవ్వాలని హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఇవ్వడంతో ఈ రోజు మళ్లీ సింగిల్ బెంచ్ మీద .. అత్యవసరంగా...

విజయసాయిరెడ్డి అసలు క్యారెక్టర్ మళ్లీ బయటకు !

లోపల క్యారెక్టర్ అలాగే ఉంది.. బయటకే మంచిగా కనిపిస్తున్నా అని విజయసాయిరెడ్డి మరోసారి నిరూపించారు. కొన్నాళ్లుగా ఆయన తాను మారిపోయినట్లుగా.. పెద్ద మనిషినన్నట్లుగా కనిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ పార్లమెంట్‌లో అసలు...

జగన్ జైలుకుపోతే షర్మిలే సీఎం !

తెలంగాణలో రాజకీయాలు చేస్తున్న వైఎస్ఆర్ బిడ్డ షర్మిల కష్టాన్ని బీఆర్ఎస్ నేతలు తేలికగా తీసుకుంటున్నారు. ఓట్లు రాని ఇంత కష్టం ఎందుకని.. కాస్త కష్టపడితే పదవి వచ్చే మార్గాన్ని బీఆర్ఎస్ నేతలు విశ్లేషించి...

జగన్‌కు “అప్పు రత్న” బిరుదిచ్చిన పవన్ !

సీఎం జగన్ చేస్తున్న అప్పులపై జనసేనాని పవన్ కల్యాణ్ సెటైర్ వేశారు. ఆయనకు అప్పు రత్న అవార్డు వచ్చినట్లుగా అధికారులు ఆయనకు ఓ మెమెంటోను తెచ్చి ఇస్తున్నట్లుగా కర్టూన్ తన సోషల్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close