సరోగసి పేరుతో పిల్లల అమ్మకాలకు పాల్పడిన సృష్టి ఆస్పత్రి వైద్యురాలు డాక్టర్ నమ్రత ముఠాలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ సోదరుడు రవి ఉన్నట్లుగా తేలింది. కేజీహెచ్ ఆస్పత్రిలో అనస్థీషియా వైద్యుడిగా ఉన్న డాక్టర్ వాసుపల్లి రవిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు. చేశారు.
విశాఖ కేంద్రంగానే సృష్టి ఆస్పత్రి వైద్యురాలు నమ్రత సరోససి పేరుతో లక్షలు వసూలు చేసి బిడ్డల్ని అమ్మినట్లుగా అనుమానిస్తున్నారు. అందుకే నేరం జరిగింది విశాఖలో అయితే హైదరాబాద్ లో కేసులు పెట్టారని ఆరోపిస్తున్నారు. ఆమె మోసం చేసిన రాజస్తాన్ దంపతులకు హైదరాబాద్ లో తెలిసిన వారు ఉన్నారని కేసు పెట్టారని ఆరోపిస్తున్నారు. అయితే ఈ కేసులో ఎక్కడ కేసు పెట్టారన్నది ముఖ్యం కాదు. ఎందుకంటే అన్నిచోట్లా సృష్టి ఆస్పత్రులు ఉన్నాయి. విశాఖలో ఓ పెద్ద ఆస్పత్రి భవనాన్ని నిర్మిస్తున్నారు.
అత్యంత పవిత్రమైన వైద్య వృత్తిలో ఉంటూ అత్యంత అమానవీయంగా డబ్బుల కోసం సరోగసి అని చెప్పి.. పిల్లల అమ్మకం చేసిన డాక్టర్ నమ్రత ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఆ ముఠాలో ఉన్న వారందరినీ పోలీసులు అరెస్టు చేస్తున్నారు. పిల్లల్ని కొనుగోలు చేసే ముఠాలు.. అమ్మే ముఠాలతోనూ వీరికి సంబంధాలు ఉన్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి.
వాసుపల్లి గణేష్ రాజకీయంగా యాక్టివ్ గా ఉన్న సమయంలోనే ఆయన సోదరుడు రవి ఈ దందా చేశారు. తన సోదరుడితో సంబంధం లేదని ఆయన చెప్పుకోవచ్చు కానీ.. దీనికి ఆయన సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు.