‘అత్యంత చౌకగా లభించే వినోదం సినిమా’ అని అభిప్రాయపడ్డారు మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు. ‘మహానటి’ సావిత్రి 90వ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన అతిథిగా పాల్గొన్నారు. ‘సావిత్రి జీవితం నుంచి ఎన్నో విషయాలు నేటితరం నేర్చుకోవచ్చు. నవరసాలు పలికించే ఆమె నటన అద్భుతం. ప్రస్తుతం అలాంటి నటీమణులు లేరు’ అన్నారు.
సినిమా వ్యాపారమే అయినప్పటికీ అది కళాత్మకమని నిర్మాతలు గుర్తు పెట్టుకోవాలని, మంచి సినిమా ఉంటే అందరూ చూస్తారని, తెలుగు సాహిత్యంలో ఉన్న ఎన్నో గొప్ప కథలు వున్నాయి, వాటిని దర్శక, నిర్మాతలు సీరియల్స్ రూపంలో నేటి తరానికి అందించాలని కోరారు.
వెంకయ్యనాయుడు ప్రసంగంలో ప్రాసలకు ప్రత్యేకస్థానం వుంటుంది. ఆయన ఏ అంశం మాట్లాడిన అనర్గళంగా ప్రాసలు, ఛలోక్తులు దొర్లుతాయి. ఈ పప్రసంగంలో కూడా కొన్ని మెరపులు వున్నాయి. ”అప్పటి సినిమాల్లో హీరో-హీరోయిన్ ఒకరినొకరు తాకకుండా శృంగారాన్ని పండించేవారు. ఇప్పుడు తాకిన గోకినా ఏం జరగడం లేదు. అంత తేడా వచ్చేసింది’ అని ఆయన వాఖ్యనించడం నవ్వులు పూయించింది.