కన్నయ్యకి వెంకయ్య సలహా…సరయినదేనా?

జె.ఎన్.యు.విద్యార్ధి కన్నయ్య కుమార్ కి కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఒక సలహా ఇచ్చారు. “ప్రజలలో ఇప్పుడు అతను చాలా పాపులర్ అయ్యి ఉండవచ్చును కానీ ఆ పాపులారిటీని చూసుకొని మురిసిపోకుండా ఫిబ్రవరి 9న యూనివర్సిటీలో జరిగినటువంటి కార్యక్రమాలు మళ్ళీ పునరావృతం కాకుండా సంబంధిత అధికారులకు సహకరిస్తే బాగుంటుంది. దేశవ్యతిరేక నినాదాలు చేశాడని వచ్చిన ఆరోపణలను అతను ఇంత వరకు ఖండించలేదు. అతను రాజకీయాలకు దూరంగా ఉంటూ తన చదువులపైనే శ్రద్ధ పెడితే బాగుంటుంది. ఒకవేళ రాజకీయాలపై మరీ అంత మోజు ఉన్నట్లయితే ఆ చదువులు విడిచిపెట్టి రాజకీయాలలో చేరితే బాగుంటుంది. అతను ఏ పార్టీలో అయినా చేరవచ్చును. అతను అభిమానిస్తున్న పార్టీ పార్లమెంటులో సింగిల్ డిజిట్ పార్టీగా ఉంది. దానిలోనయినా అతను చేరవచ్చును. దేశద్రోహులు, తీవ్రావాదులయిన అఫ్జల్ గురు, యాకూబ్ మీమన్ మరియు మక్బూల్ భట్ కోసం సాటి విద్యార్ధులను చెడగొట్టి వారి జీవితాలతో ఆడుకోవడం కంటే తను చెప్పదలచుకొన్నవన్నీ ఏదయినా ఒక రాజకీయపార్టీలో చేరి చెపితే బాగుంటుంది,” అని వెంకయ్య నాయుడు అన్నారు.

విద్యార్ధులు రాజకీయాలకు దూరంగా ఉండాలని చెపుతున్న వెంకయ్య నాయుడు తను చదువుకొనే రోజుల్లో స్వయంగా విద్యార్ధి నాయకుడుగా ఉంటూ మెల్లగా రాజకీయాలలోకి వచ్చేరు. ఆయన ఆంధ్రాయూనివర్సిటీలో చదువుకొనే రోజుల్లో (1972) జరిగిన ‘జై ఆంధ్రా ఉద్యమం’లో రాజకీయ నాయకుల దృష్టిలో పడ్డారు. 1973-74 సం.లలో ఎబివిపి విద్యార్ధి సంఘానికి నాయకుడిగా పనిచేసారు. ఆ తరువాత జయప్రకాష్ నారాయణ్ మొదలుపెట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ తరువాత బీజేపీలో చేరి నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజక వర్గం నుండి 1978లో ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చేరు. అప్పటి నుండి ఆయన రాజకీయాలలో అంచెలంచెలుగా పైకి ఎదుగుతూ నేడు ఈ స్థాయికి ఎదిగారు. ఆయన తరానికి చెందిన చాలామంది రాజకీయ నాయకులు ఆవిధంగా పైకి వచ్చినవారే. మరి ఇప్పుడు కన్నయ్య కుమార్ కూడా ఆయన బాటలోనే నడుస్తున్నప్పుడు వెంకయ్య నాయుడు అభ్యంతరం చెపుతున్నారు.

కన్నయ్య కుమార్ దేశ వ్యతిరేక నినాదాలు చేసాడని, దేశ వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించాడని వెంకయ్య నాయుడు ఆరోపిస్తున్నారు. కానీ అటువంటి ఆధారాలు ఏవీ లేనందునే సుప్రీం కోర్టు అతనిని జైలు నుండి విడుదల చేసిన సంగతి ఆయనకి తెలుసు. నిజానికి ఈ సమస్యకి మూలకారణం కన్నయ్య కుమార్ కాంగ్రెస్ పార్టీ ఆలోచనలకి అనుగుణంగా పనిచేస్తుండటమేనని చెప్పవచ్చును. అతను నిన్న సాయంత్రం యూనివర్సిటీలో చేసిన ప్రసంగం విన్నట్లయితే ఆ విషయం అర్ధమవుతుంది. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి దేశంలో అసహనం పెరిగిపోతోంది, బలహీనవర్గాలు అణిచివేయబడుతున్నారు. భావ ప్రకటన స్వేచ్చ కొరవడుతోందని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారానికి అనుగుణంగానే కన్నయ్య కుమార్ ప్రసంగం సాగింది.

కాంగ్రెస్ పార్టీ ఒక పధకం ప్రకారం దేశంలో యూనివర్సిటీలలో ఉన్న కాంగ్రెస్ అనుబంధ విద్యార్దీ సంఘాల ద్వారా విద్యార్ధులను ఈవిధంగా రెచ్చగొడుతోందని కేంద్రం అనుమానిస్తోంది. కన్నయ్య కుమార్ కూడా కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న ఆ రాజకీయ చదరంగంలో పావేనని బీజేపీ నమ్ముతున్నట్లుంది. ఒకప్పుడు వెంకయ్య నాయుడు తనకు నచ్చిన ఎబివిపి విద్యార్ధి సంఘాన్ని ఎంచుకొని అందులో చేరి రాజకీయాలలోకి వచ్చినట్లే కన్నయ్య కుమార్ కూడా తనకు నచ్చిన సంఘంలో చేరాడు. అయితే అతను కాంగ్రెస్ పార్టీ మాయలో పడి కేంద్రప్రభుత్వానికి ఇబ్బంది లేదా నష్టం కలిగించే ప్రయత్నాలు చేస్తున్నట్లు అనుమానించడం చేతనే కేంద్ర ప్రభుత్వానికి, అతనికి మధ్య ఈ ఘర్షణ వాతావరణం ఏర్పడిందని భావించవచ్చును.

అతని విషయంలో వెనుక నుండి ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఏవిధంగాను నష్టపోదు. పైగా ఇటువంటి సమస్యలు ఏర్పడితే దానికి రాజకీయంగా మేలే చేకూరుతుంది. ఈ సమస్యని అడ్డుపెట్టుకొని పార్లమెంటులో మోడీ ప్రభుత్వాన్ని డ్డీ కొనడం గమనిస్తే ఆ సంగతి అర్ధమవుతుంది. కనుక యూనివర్సిటీ స్థాయికి చేరుకొన్న విద్యార్ధులు తమ భవిష్యత్ దెబ్బ తినకుండా జాగ్రత్తపడుతూ తమకు నచ్చిన దారిలో పయనించడం మంచిది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అయితే “ఆదిపురుష్” బీజేపీ ప్రచార చిత్రం కాదన్న మాట !

ఆదిపురుష్ అనే సినిమాలో నటించడానికి ప్రభాస్ అంగీకరించినప్పటి నుండి చాలా మందికి ఆ సినిమాపై డౌట్స్ ఉన్నాయి. ఇటీవల కేటీఆర్ అది బీజేపీ ప్రచార చిత్రమని.. వచ్చే ఎన్నికలకు ముందు అయోధ్య...

మునుగోడుకు 86 మంది ఎమ్మెల్యేల్ని పంపుతున్న కేసీఆర్ !

మునుగోడులో టీఆర్ఎస్ తరపున ప్రచారం చేయడానికి తమ పార్టీకి ఉన్న 86 మంది ఎమ్మెల్యేల్ని పంపుతున్నారు. నియోజకవర్గాన్ని 86 యూనిట్లుగా విభజించారు. ఒక్కో యూనిట్కి ఒక్కో ఎమ్మెల్యే ఇంచార్జ్గా ఉంటారని టీఆర్ఎస్...

డిజిట‌ల్‌లో ‘శివ‌’

ఈమ‌ధ్య రీ రిలీజ్‌ల హంగామా ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. పోకిరి, జ‌ల్సా, చెన్న‌కేశ‌రెడ్డి సినిమాలు రీ రిలీజ్ అయి భారీ వ‌సూళ్లు మూట‌గ‌ట్టుకొన్నాయి. త్వ‌ర‌లోనే ప్ర‌భాస్ - బిల్లా కూడా రీ రీలీజ్ అవ్వ‌బోతోంది....

రీమేకుల‌పై మెగాస్టార్ మాట‌

చిరంజీవిపై ఓ విమ‌ర్శ బ‌లంగా వినిపిస్తుంటుంది. ఆయ‌న ఎక్కువ‌గా రీమేకుల‌పై ఆధార‌ప‌డ‌తాడ‌ని. రీ ఎంట్రీ గా వ‌చ్చిన ఖైదీ నెం.150 రీమేకే. రేపు విడుద‌ల‌య్యే గాడ్ ఫాద‌ర్ కూడా రీమేకే. ఇప్పుడు చేతిలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close