వెంకీ కోసం ట్రైయాంగిల్ క్రైమ్ స్టొరీ


వెంకటేష్ అనిల్ రావిపూడి సినిమా ఫిక్స్ అయ్యింది. F2 , F3 తర్వాత మరో సినిమా కోసం జతకట్టారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం అనిల్ ఎంచుకున్న పాయింట్ భలే గమ్మత్తుగా వుంది. సింగిల్ లైన్ లో చెప్పాలంటే ఇదొక ట్రై యాంగిలర్ క్రైమ్ ఎంటర్‌టైనర్. హీరో, అతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, అతని వైఫ్. ఇదీ థీమ్. అనిల్ ఆలోచనలు ఇంతే సింపుల్ గా సూపర్ గా వుంటాయి. ఇందులోనే ఫ్యామిలీ ఆడియన్స్ కి కావాల్సిన హిలేరియస్ ఎలిమెంట్స్ అన్నీ సమకూరుస్తున్నారు. ఈ సినిమా మ్యూజిక్ కోసం భీమ్స్ ని తన టీంలోకి తీసుకున్నారు అనిల్. మంచి మాస్ పల్స్ తెలిసిన కంపోజర్ తను. జనాల్లోకి వెళ్ళే ట్యూన్స్ ని ఇచ్చే నేర్పు వుంది. 2025సంక్రాంతికి ఈ సినిమా వస్తుందని అధికారకంగా ఖరారు చేశారు. చిరంజీవి విశ్వంభర, రవితేజ సినిమాతో పాటు ఇంకొన్ని ప్రాజెక్ట్స్ కూడా ఈ బరిలో వున్నాయి. ఇప్పుడు వెంకీ అనిల్ కూడా సంక్రాంతికి ముస్తాబౌతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గురి తప్పిన ట్వీట్… వైసీపీ ప్లాన్ బూమరాంగ్!

ఎన్నికల్లో ఘోర పరాజయంతో పార్టీ మనుగడనే ప్రశ్నార్ధకం చేసుకున్న వైసీపీ... సోషల్ మీడియా పుణ్యమా అని తన గోతిని తనే తవ్వి తీసుకుంటున్నట్లు కనబడుతోంది. కూటమి సర్కార్ ను టార్గెట్ చేయబోయి తన...

టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీ‌నివాస్

ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ ను నియమించారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. ప్రస్తుతం అధ్యక్షుడిగా కొనసాగుతోన్న అచ్చెన్నాయుడు మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ఆయన స్థానంలో పల్లాకు పార్టీ పగ్గాలు అప్పగించినట్లు...

ప‌వ‌న్ ఇక సినిమాల‌కు గుడ్ బై చెప్పిన‌ట్లేనా?

డిప్యూటీ సీఎం... గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్, గ్రామీణ తాగునీటితో పాటు అడ‌వులు లాంటి కీల‌క శాఖ‌లు. అంటే ప్ర‌తిరోజు జ‌నంతో మ‌మేకం అయ్యే శాఖ‌లే. ప్ర‌తి రోజు అలుపెర‌గ‌కుండా ప‌ర్య‌టిస్తూ, రివ్యూలు చేస్తూ, నిర్ణ‌యాలు...

శాఖ‌ల కేటాయింపు… పొత్తుల్లో మోడీనే ఫాలో అయిన చంద్ర‌బాబు

రెండ్రోజులుగా ఎదురుచూస్తున్న మంత్రుల‌కు శాఖ‌ల కేటాయింపు ఏపీలోనూ పూర్త‌యింది. గ‌తానికి భిన్నంగా ఈసారి శాఖ‌ల కేటాయింపు కాస్య ఆల‌స్య‌మైనా...స‌మ‌తుల్యంగా కేటాయించిన‌ట్లు క‌న‌ప‌డుతోంది. అయితే, ఈ శాఖ‌ల కేటాయింపులో చంద్ర‌బాబు -మోడీ ఒకేవిధంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close