వెంకీ … త్రిష … ముహూర్తం ఫిక్స్‌!

ప్ర‌స్తుతం అనిల్ రావిపూడితో ఓ సినిమా చేస్తున్నాడు వెంక‌టేష్‌. క్రైమ్ జోన‌ర్‌లో న‌డిచే ఈ క‌థ‌లో మీనాక్షి చౌద‌రి, ఐశ్వ‌ర్య రాజేష్ క‌థానాయికలు. ఈ సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తారు. ఈలోగా వెంకీ మ‌రో సినిమాకు ప‌చ్చ జెండా ఊపారు. ‘సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌’ సినిమాతో ర‌చ‌యిత‌గా గుర్తింపు తెచ్చుకొన్న నందు క‌థ‌కు వెంకీ ఓకే చెప్పారు. చిట్టూరి శ్రీ‌నివాస్ ఈ చిత్రానికి నిర్మాత‌. ఇదో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌. ఈ ద‌స‌రాకు లాంఛ‌నంగా క్లాప్ కొడ‌తారు. 2025 వేస‌విలో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చే అవ‌కాశాలు ఉన్నాయి. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా త్రిష‌ని ఎంచుకొన్న‌ట్టు తెలుస్తోంది. అనిల్ రావిపూడి సినిమా కోసం త్రిష‌ని సంప్ర‌దించారు. అయితే అప్ప‌టి బిజీ షెడ్యూల్స్ వ‌ల్ల త్రిష ‘ఓకే’ చెప్ప‌లేక‌పోయింది. ఈసారి మాత్రం వెంకీతో జోడీ క‌ట్ట‌డానికి రెడీ అయ్యింద‌ని తెలుస్తోంది.

‘ఆడ‌వారి మాట‌ల‌కు అర్థాలే వేరులే’, ‘న‌మో వెంక‌టేశ‌’ చిత్రాల‌లో వెంకీ, త్రిష‌లు జోడీగా క‌నిపించారు. ‘ఆడ‌వారి..’ హిట్ అయితే, ‘న‌మో వెంక‌టేశ‌’ ఫ్లాప్ అయ్యింది. ఇది వీరి కాంబోలో హ్యాట్రిక్ సినిమా. త్రిష ఇప్ప‌టికే చిరంజీవి ‘విశ్వంభ‌ర‌’లో క‌థానాయిక‌గా న‌టిస్తున్న సంగతి తెలిసిందే. 2025 సంక్రాంతికి ‘విశ్వంభ‌ర‌’ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అప్పుడు రాజ్ తరుణ్… ఇప్పుడు సుహాస్

చిన్న సినిమా టాక్ బావుంటే గానీ థియేటర్స్ కి జనం రారు. కంటెంట్ నమ్ముకొని చాలా ప్లాన్ గా చేసుకొని తమ మార్కెట్ ని కాపాడుకోవడం ద్రుష్టిపెడుతుంటారు హీరోలు. అయితే కొన్నిసార్లు పరిస్థితులు...

ఏపీకి మేఘా కృష్ణారెడ్డి రూ. 5 కోట్ల విరాళం !

మేఘా గ్రూపు కంపెనీలు ఏపీకి రూ. ఐదు కోట్ల విరాళం ఇచ్చాయి. వరద బాధితుల కోసం బడా కాంట్రాక్టర్లు స్పందించలేదని విమర్శలు వస్తున్న సమయంలోనే మేఘా కృష్ణారెడ్డి సోదరులు విజయవాడలో చంద్రబాబును కలిశారు....
video

రీల్స్ ని టార్గెట్ చేసిన రజనీ

https://www.youtube.com/watch?v=AiD6SOOBKZI సినిమా పాట ఈక్వేషన్ మారిపోయింది. మంచి పల్లవి, ఆకట్టుకునే చరణాలు, కలకాలం నిలిచిపోయే ట్యూన్ కోసం శ్రమించేవారు సంగీత దర్శకులు. ఇది గతం. ఇప్పుడంతా రీల్స్ ట్రెండ్. ట్యూన్ చేస్తే రీల్స్ లో...

భారత్‌లోకి మంకీపాక్స్ ఎంట్రీ

మంకీపాక్స్ భారత్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి అనుమానాస్పద కేసు పాజిటివ్ గా తేలింది. దీంతో కేంద్రం అలర్ట్ జారీ చేసింది. మంకీపాక్స్ లక్షణాలు ఉన్న వారిని ప్రత్యేక క్వారంటైన్‌లకు తరలించే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close