అఫీషియ‌ల్ : ‘అసుర‌న్’ రీమేక్ వెంక‌టేష్‌

ధ‌నుష్ న‌టించిన త‌మిళ చిత్రం ‘అసుర‌న్‌’. ఈ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యింది. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తార‌ని కొద్ది రోజులుగా జోరుగా ప్ర‌చారం జ‌రుగుతూ వ‌చ్చింది. ఇప్పుడు అదే నిజ‌మైంది. ఈసినిమాని వెంక‌టేష్ తో రీమేక్ చేస్తున్నారు. ఈ విష‌యాన్ని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ ప్ర‌క‌టించింది. క‌లైపులి ఎస్‌.థానుతో క‌ల‌సి సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. ప్ర‌స్తుతం వెంక‌టేష్ ‘వెంకీ మామ‌’లో న‌టిస్తున్నారు. ఆ సినిమా పూర్త‌యిన త‌ర‌వాత‌.. ఈ రీమేక్ ప‌ట్టాలెక్క‌బోతోంది. ఈ లోగా ద‌ర్శ‌కుడు ఎవ‌రన్న‌ది తేలుతుంది. ఈ సినిమాపై రామ్ చ‌ర‌ణ్ కూడా దృష్టి సారించార‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే సురేష్ బాబు వెంట‌నే రంగంలోకి దిగి రీమేక్ రైట్స్ చేజిక్కించుకున్నారు. దాంతో వెంక‌టేష్‌కి `అసుర‌న్‌` చేసే అవ‌కాశం ద‌క్కింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తెలంగాణ కంటే ఏపీకి రెట్టింపు పన్నుల వాటా రిలీజ్ చేసిన కేంద్రం !

ఏపీకి నిధుల విషయంలో అన్నీ కలసి వస్తున్నాయి. ధనిక రాష్ట్రం.. కేంద్రానికి పెద్ద ఎత్తున పన్నులు సంపాదించి పెట్టే తెలంగాణ కంటే.. రెట్టింపు పన్నుల వాటా నిధులు ఏపీకి వస్తున్నాయి. కేంద్రం తాజాగా...

మ‌ళ్లీ రంగంలోకి దిగుతున్న చిరు

క‌రోనా థ‌ర్డ్ వేవ్ ప్ర‌భావం తీవ్రంగా ఉండ‌డంతో అగ్ర క‌థానాయ‌కులంతా ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. షూటింగుల‌కు రామ‌ని చెప్పేశారు. చిరంజీవి కూడా త‌న చేతిలో సినిమాల‌న్నీ ప‌క్క‌న పెట్టేశారు. ఇప్పుడు మ‌ళ్లీ ఆయ‌న మేక‌ప్...

పెద్ద బ్యాన‌ర్ల చేతిలో ప‌డిన శ్రీ‌కాంత్ త‌న‌యుడు

ఈమ‌ధ్య పెద్ద బ్యాన‌ర్లు చిన్న సినిమాల‌పై దృష్టి నిలిపాయి. `జాతిర‌త్నాలు`తో చిన్న‌సినిమాల వ‌ల్ల ఉన్న లాభాలేమిటో అశ్వ‌నీద‌త్ లాంటి అగ్ర నిర్మాత‌కు బాగా అర్థ‌మైంది. అందుకే ఇప్పుడు మ‌రో చిన్న సినిమాకి...

ఉద్యోగుల్ని రెచ్చగొడుతున్న మంత్రులు, ప్రభుత్వం !

పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలని పాత జీతాలే ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ రోడ్డెక్కిన ఉద్యోగులను ప్రభుత్వం మరింతగా రెచ్చగొడుతోంది. జీతాల బిల్లులను వెంటనే ప్రాసెస్ చేయాలని ట్రెజరీలకు ఆదేశాలు ఇచ్చింది. ఉద్యోగులు రోడ్డెక్కినప్పటికీ.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close