చైతూకే కాదు.. నేను అంద‌రికీ వెంకీ మామ‌నే: వెంక‌టేష్‌

సోలో సినిమాలు బాగా త‌గ్గించేశాడు వెంకీ. ఇప్పుడు చేస్తున్న‌వ‌న్నీ మ‌ల్టీస్టార‌ర్ సినిమాలే. అయితే `వెంకీ మామ‌`కి మాత్రం వెంకీ బాగా క‌నెక్ట్ అయిపోయాడు. త‌న మేన‌ల్లుడు నాగ‌చైత‌న్య‌తో తొలిసారి క‌ల‌సి న‌టించ‌డం వ‌ల్లేమో… ఈ సినిమాని బాగా ఓన్ చేసుకున్నాడు. ఈ సినిమాకి సంబంధించి ఎప్పుడు మాట్లాడాల్సివ‌చ్చినా కాస్త ఎమోష‌న్ అయిపోతున్నాడు. వెంకీ మామ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ ఖ‌మ్మంలో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా వెంక‌టేష్ ఎప్ప‌టిలా స‌ర‌దాగా స్పీచ్ మొద‌లెట్టి, మ‌ధ్య‌లో కాస్త ఎమోష‌న్ అయ్యి.. చివ‌ర్లో అల్ల‌రి చేసి, ప్రేక్ష‌కుల‌కు హుషారు పంచాడు.

ఈ సినిమాలో త‌ను చైతూకి మాత్ర‌మే వెంకీ మామ అని – సినిమా విడుద‌ల‌య్యాక తెలుగు ప్ర‌జ‌లంద‌రికీ నేను వెంకీ మామానే అని అన్నాడు వెంకీ. ఈ సినిమాలో చైతూ న‌ట‌న చింపేశాడ‌ని, ఓ మామ‌గా త‌న‌కు అంత‌కంటే ఏం కావాల‌ని, చైతూని చూస్తుంటే గ‌ర్వంగా ఉంద‌న్నాడు. బాబి ఈ సినిమాని బాగా హ్యాండిల్ చేశాడ‌ని, ప్ర‌తి ఒక్క‌రూ వంద శాతం క‌ష్ట‌ప‌డ్డార‌ని కితాబిచ్చాడు. సింగిల్ హ్యాండ్ గ‌ణేష్ అంటూ డైలాగులు చెప్పి అభిమానుల్ని ఉర్రూత‌లూగించాడు. వెంకీ ఆస‌నం వేసి అల‌రించాడు. ‘ఖ‌మ్మం.. ఆ సౌండ్ ఏద‌మ్మా..’ అంటూ ఉత్సాహ‌ప‌రిచాడు. మొత్తానికి వేదిక‌పై వెంకీ ఫుల్ ఎన‌ర్జీతో క‌నిపించాడు. విడుద‌ల‌కు ముందు ఇదో పాజిటీవ్ వైబ్రేష‌న్ అనుకోవాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com