రాజుగారి గదిలో వెంక‌టేష్‌

రాజుగారి గ‌ది ఫ్రాంచేజీలు వ‌రుస‌గా దింపుతున్నాడు ఓంకార్‌. రాజుగారి గ‌ది 1 మంచి హిట్ అయ్యింది. రాజుగారి గ‌ది 2 ఫ‌ర్వాలేద‌నిపించుకుంది. ఇప్పుడు మూడో గ‌దినీ చూపించ‌బోతున్నాడు. రాజుగారి గ‌ది 4 లో వెంక‌టేష్ కనిపించ‌బోతున్నాడు. ఈ విష‌యంపై ఓంకార్ క్లారిటీ ఇచ్చాడు కూడా.

వెంక‌టేష్ తో తాను ఓ సినిమా చేయాల‌ని, వెంకీ ఆ ఆఫ‌ర్ ఇది వ‌ర‌కే ఇచ్చాడ‌ని చెప్పుకొచ్చాడు ఓంకార్‌. నిజానికి రాజుగారి గ‌ది 2 వెంక‌టేష్‌తోనే చేద్దామ‌నుకున్నాడ‌ట‌. కానీ డేట్లు స‌ర్దుబాటు కాలేక నాగార్జున‌తో తెర‌కెక్కించాడు. రాజుగారి గ‌ది 4 గానీ 5 గానీ వెంకీతో చేయ‌డం ఖామంటున్నాడు ఓంకార్‌. రాజుగారి గ‌ది 3 శుక్ర‌వారం విడుద‌ల అవుతోంది. అది గ‌నుక హిట్ట‌యితే.. 4లో వెంకీని చూడొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com