గ్రాఫిక్స్ మాయాజాలం: ప్ర‌భాస్‌, పూజాలు లేకుండానే పాట పూర్తి

విజువ‌ల్ ఎఫెక్ట్స్ ఉంటే ఏదైనా చేసేయొచ్చు. వెండి తెర‌పై అద్భుతాలు సృష్టించొచ్చు. లేనిది ఉన్న‌ట్టుగా, ఉన్న‌ది లేన‌ట్టుగా భ్ర‌మింప‌చేయొచ్చు. ఆఖ‌రికి న‌టీన‌టులు లేకపోయినా, వాళ్లున్న‌ట్టు సీన్లు లాగించేయొచ్చు. `రాధే శ్యామ్‌`లో ఇదే జ‌రిగింది. ఈ సినిమాలో ప్ర‌భాస్ – పూజా హెగ్డేల‌పై ఓ పాట ఉంది. దాన్ని ప్ర‌భాస్, పూజాలు లేకుండానే పూర్తి చేసేశారు. అదే.. ఇక్క‌డ మ్యాజిక్కు.

రాధే శ్యామ్ లో ఓ శృంగార భ‌రిత‌మైన గీతం ఉంది. ఆ పాట తెర‌కెక్కించ‌డానికి పూజా హెగ్డే కాల్షీట్లు అందుబాటులో లేవు. పైగా పూర్తి రొమాంటిక్ పాట అది. అలాంటి పాట‌ల్లో న‌టించ‌డానికి ప్ర‌భాస్‌కి బాగా సిగ్గు… మొహ‌మాటం. అందుకే చిత్ర‌బృందం వీఎఫ్ఎక్స్ స‌హాయం తీసుకుంద‌ని టాక్‌. బాడీ డ‌బుల్ అనే ఓ ప‌ద్ధ‌తి ఉంది. అంటే… డూప్ అన్న‌మాట‌. ప్ర‌భాస్‌, పూజాల డూప్‌ల‌తో.. ఆ పాట పూర్తి చేసేశారు. క్లోజులు పెట్టేట‌ప్పుడు మాత్రం ప్ర‌భాస్‌, పూజా హెగ్డేల ఫేసులు క‌నిపిస్తాయి. ఆ పాట‌ని 90 శాతం బాడీ డ‌బుల్స్‌తోనే పూర్తి చేశార‌ని టాక్‌. ఇదే కాదు.. ఈ సినిమాలోని కొన్ని షాట్స్ ని.. ప్ర‌భాస్‌, పూజాల డూపుల‌తో లాగించేశార్ట‌. వీఎఫ్ఎక్స్ మ‌హిమే అది. దాంతో ఏదైనా సాధ్య‌మే. భ‌విష్య‌త్తులో హీరో, హీరోయిన్లు సెట్లోకి అడుగుపెట్ట‌కుండానే మొత్తం సినిమా లాగించేసినా చేయొచ్చు. ఆ రోజులు ఎంతో దూరంలో లేవు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తెలంగాణలోనూ మసీదులు తవ్వుదామంటున్న బండి సంజయ్ !

బండి సంజయ్ ఏ మాత్రం మొహమాటలు పెట్టుకోవడం లేదు. ముందూ వెనుకా ఆలోచించడం లేదు. తన రాజకీయం తాను చేస్తున్నారు. యూపీలో జ్ఞానవాపి మసీదులో శివలింగం బయటపడిందని.. తెలంగాణలోనూ అదే వాదన...

అనంతబాబు సస్పెన్షన్ – గౌతంరెడ్డిని చేసినట్లుగానేనా!?

ఎమ్మెల్సీ అనంతబాబును చేయలేక.. చేయలేక సస్పెండ్ చేశారు వైఎస్ఆర్‌సీపీ అగ్రనేతలు. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లుగా మీడియాకు సమాచారం ఇచ్చారు. అయితే నిజంగానే సస్పెండ్ చేశారో లేకపోతే.. గతంలో వంగవీటి రంగాపై...

మా పార్టీ నేతలపై దాడులు చేసుకుంటామా ?: సజ్జల

అమలాపురం దాడుల వెనుక వైసీపీ నేతల కుట్ర ఉందన్న తీవ్ర ఆరోపణలు వస్తూండటంతో ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెరపైకి వచ్చారు. విపక్షాల విమర్శలు చూస్తుంటే... నవ్వొస్తుంది... అధికార పార్టీ నేతలప ఇళ్లపై...

మళ్లీ జగన్‌ను దారుణంగా అవమానించిన టీఆర్ఎస్ మంత్రి !

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దావోస్‌లో కేటీఆర్‌తో భేటీ అయి... తమ మధ్య మంచి ర్యాపో ఉందని నిరూపిస్తూంటే తెలంగాణలో మాత్రం టీఆర్ఎస్ నేతలు దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏపీ సీఎం జగన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close