‘కేసీఆర్‌కు రు.5 కోట్లతో బస్సు అవసరమా?’

హైదరాబాద్: ముఖ్యమంత్రికోసం తెలంగాణ ప్రగతి రథం పేరుతో రు.5 కోట్ల ఖర్చుతో బస్సు కొనుగోలు చేయటం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటమేననికాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆరోపించారు. కేసీఆర్‌కు ఎవరినుంచీ ప్రాణహాని లేదని, అలాంటప్పుడు అంత ఖర్చు చేయాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు. ఆ రు.5 కోట్లను పేదలకోసం ఖర్చు చేయొచ్చు కదా అన్నారు. వీహెచ్ ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధిని కలిశారు. డీఎస్ రాజీనామా, తెలంగాణలో పార్టీ పరిస్థితులువంటి తాజా పరిణామాలను ఆమెకు వివరించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన వీహెచ్, డీఎస్ పచ్చి అవకాశవాది అని, ఎక్కడ పచ్చగా ఉంటే అక్కడకు వెళ్ళి వాలిపోతారని అన్నారు. ఆయన పార్టీ వీడటంవల్ల నష్టమేమీ లేదని చెప్పారు.

కేసీఆర్ కోసం రు.5 కోట్లతో రూపొందిన ఈ బస్సును చండీగఢ్‌లోని ఓ కంపెనీ తయారు చేసింది. మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన ఈ బస్సును ఆ కంపెనీ బుల్లెట్ ప్రూఫ్‌గా మార్చటమేకాక, లోపల పడకగది, బాత్‌రూమ్, చిన్న సమావేశ మందిరం, వైఫై వంటి సౌకర్యాలనుకూడా ఏర్పాటు చేశారు. ఈ బస్సు నిన్న హైదరాబాద్ చేరుకుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close