సహాయం అర్ధిస్తున్న సల్మాన్ భాధితులు

హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నిర్దోషి అని బాంబే హైకోర్టు ప్రకటించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బాలీవుడ్ సినీ పరిశ్రమ, సల్మాన్ ఖాన్ అభిమానులు కోర్టు తీర్పును స్వాగతించగా, చాలా మంది దానిని తప్పు పడుతున్నారు. ఈ కేసులో సల్మాన్ ఖాన్ దోషి కాకపోతే మరెవరు దోషి? అని ప్రశ్నిస్తున్నారు. కారుని ఎవరూ నడుపకపోతే కారే మందు కొట్టి ఫుట్ పాత్ మీద పడుకొన్న వారి మీద నుంచి వెళ్ళిందా? అని ప్రశ్నిస్తున్నారు. ఎవరి అభిప్రాయలు ఎలాగ ఉన్నప్పటికీ ఈ ప్రమాదంలో మరణించిన నూరుల్లా షరీఫ్ కుటుంబం, గాయపడిన మను ఖాన్, మొహమ్మద్ అబ్దులా షేఖ్, మొహమ్మద్ ఖలీమ్ ఇక్బాల్ పఠాన్ మరియు ముస్లిం నియామాత్ షేఖ్ కోర్టు తీర్పుపై భిన్నంగా స్పందిస్తున్నారు.

“సల్మాన్ ఖాన్ కి కోర్టు శిక్ష విధించిందా లేదా? అని మేము ఆలోచించడం లేదు. అతనికి శిక్ష విధించినా, క్షమించినా దాని వలన దెబ్బ తిన్న మా జీవితాలలో ఎటువంటి మార్పు కలుగదు. ఈ ప్రమాదం జరిగిన తరువాత మా జీవితాలు దుర్భరంగా మారిపోయాయి. మమ్మల్ని తప్పకుండా అదుకొంటామని, మాకు వైద్య చికిత్సలకు అయ్యే మొత్తం ఖర్చు అంతా భరిస్తామని సల్మాన్ ఖాన్ తాలూకు మనుషులు మాకు మొదట్లో హామీ ఇచ్చేరు. కానీ ఈ కేసు వలన మా జీవితాలు మరింత దుర్భరంగా మారిపోయాయి. సల్మాన్ ఖాన్ న్ని ఈ కేసు నుండి విముక్తి లభించింది కనుక ఇకనయినా ఆయన తమను ఆదుకొంటే చాలని తమను కలిసిన మీడియా ప్రతినిధులకు చెపుతున్నారు,” అని అన్నారు.

దిగువ కోర్టు తీర్పు ప్రకారం మరణించిన నూరుల్లా షరీఫ్ కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారం ఇచ్చేమని పోలీసులు చెప్పారు. కానీ అతని భార్య, కొడుకు అందుకు అవసరమయిన దృవీకరణ పత్రాలు సమర్పించలేకపోవడంతో నేటికీ తమకు ఆ మొత్తం అందలేదని చెపుతున్నారు. గాయపడిన వారికి ఒక్కొక్కరికీ రూ.3 లక్షల నష్ట పరిహారం అందినట్లు అంగీకరించారు. అందులో సగం మొత్తం వారి చికిత్సకే ఖర్చయిపోగా మిగిలినది పోలీస్ స్టేషన్, కోర్టుల చుట్టూ తిరగడానికి, కోర్టు ఖర్చులకు ఎప్పుడో ఖర్చయిపోయిందని చెప్పారు. ప్రమాదంలో జరిగిన గాయం కంటే ఈ కేసు కోసం నిత్యం పోలీస్ స్టేషన్, కోర్టుల చుట్టూ తిరగవలసి రావడంతో ఎక్కడా స్థిరంగా పనికూడా చేసుకోలేకపోవడంతో మొహమ్మద్ ఖలీమ్ ఇక్బాల్ పఠాన్, ముస్లిం నియామాత్ షేఖ్ మళ్ళీ ఉత్తర ప్రదేశ్ లో తమ స్వగ్రామాలకు వెళ్ళిపోయారు. మిగిలిన ఇద్దరు ఇంకా ముంబైలోనే చిన్న బేకరీలలో పనిచేస్తూ భారంగా జీవితాలు వెళ్లదీస్తున్నారు.

దిగువ కోర్టు సల్మాన్ ఖాన్ దోషి అని నిర్ధారించి ఐదేళ్ళ జైలు శిక్ష విధించినపుడు, ఆయన తను అనేక సమాజాసేవా కార్యక్రమాలకు సహాయపడుతున్నానని, దానిని పరిగణనలోకి తీసుకొని తనకు శిక్ష నుండి మినహాయింపు ఇవ్వవలసినదిగా కోర్టును ప్రాదేయపడ్డారు. కానీ ఆయన అదృష్టం కొద్దీ హైకోర్టు ఏకంగా ఆయన నిర్దోషి అని ప్రకటించడమే కాకుండా ఆయనకు విధించిన జైలు శిక్షని కూడా రద్దు చేసింది. మరి ఈ కేసులో భాదితులకు న్యాయం ఎలా జరుగుతుంది? వారు తమకు న్యాయం చేయమని కోర్టుని, సల్మాన్ ఖాన్ న్ని డిమాండ్ చేయడం లేదు. ప్రమాదం కారణంగా తాము ఈ దుస్థితిలో ఉన్నామని, కేవలం మానవతా దృక్పధంతో తమను ఆదుకోమని సల్మాన్ ఖాన్ న్ని మీడియా ద్వారా ప్రాదేయపడుతున్నారు. కోర్టుల తీర్పులు సమాజంలో వ్యక్తుల స్థాయి, పరపతిని బట్టే ఉంటాయని స్పష్టం అవుతునప్పుడు భాదితుల రోదనను పట్టించుకొనేదెవరు?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జనసైనికుల్ని రెచ్చగొట్టేందుకు వైసీపీ దింపుడు కళ్లెం ఆశలు !

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం పూర్తయింది. టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు పూర్తయింది. ఏ సీట్లలో పోటీ చేయాలో కూడా ఓ నిర్ణయానికి వచ్చారు. అయితే పవన్ 24 సీట్లే తీసుకున్నారంటూ.....

విచారణకు రాను – సీబీఐకి కవిత లేఖ

ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణకు తాను హాజరు కావడం లేదని సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయండి...

మళ్లీ ఉద్యోగుల పోరాటం ప్రభుత్వానికి తాకట్టు !

ఎన్నికలకు ముందు ఉద్యోగ నేతలు ఆందోళనలు అంటూ హడావుడి చేశారు. కానీ అదంతా స్క్రిప్టెడ్ అని.. ఏమీ చేయకపోయినా ఏదో ఇచ్చినట్లుగా హడావుడి చేయడానికని మొదటి నుంచి అనుమానాలుననాయి. ఇప్పుడు అదే నిజం...

అభిప్రాయం : జనసేన శ్రేణుల అంతర్మధనం

2024 ఎన్నికల రాజకీయ వేడి రాజకుంది. తెలుగు దేశం పార్టీజనసేన కలిసి ఏర్పాటు చేసుకున్న పొత్తు లో భాగం గా జనసేన 24 ఎమ్మెల్యే సీట్ల లో పోటీ చేస్తుందని చంద్రబాబు -పవన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close