దృశ్యం 3 కూడానా..?!

మ‌ల‌యాళంలో విజ‌య‌వంత‌మైన దృశ్యమ్‌ని తెలుగులో రీమేక్ చేసి, ఇక్క‌డా హిట్ కొట్టారు. అక్క‌డ దృశ్య‌మ్ 2 వ‌స్తే.. ఇక్క‌డా రీమేక్ చేశారు. దాని ఫ‌లితం ఎలా ఉంటుందో చూడాలి. అయితే ఇప్పుడు దృశ్య‌మ్ 3 కూడా రాబోతోంది. ఈ విష‌యాన్ని వెంక‌టేష్ స్వ‌యంగా చెప్పారు. దృశ్య‌మ్ 3 ఆలోచ‌న ఉందా? అని అడిగిన ప్ర‌శ్న‌కు వెంక‌టేష్ స‌మాధానం ఇచ్చారు.

”జీతూ జోసెఫ్ తో ఈ విష‌యం మాట్లాడాను. త‌ప్ప‌కుండా మ‌రో మంచి సీక్వెల్ తో వ‌స్తా.. కానీ ఇప్పుడే కాదు… ఓ ఐదారేళ్లు ప‌ట్టొచ్చు అన్నాడు. చూద్దాం…. అప్పుడు కూడా ఈ రాంబాబు రెడీగానేఉంటాడు. కాక‌పోతే… జుత్తు నెరిసిపోతుంది. గ‌డ్డం వ‌చ్చేస్తుంది. పిల్ల‌లు మ‌రింత పెద్ద‌వాళ్లు అయిపోతారు..” అని చెప్పుకొచ్చాడు వెంకీ. ఈ సినిమా నేరుగా ఆమేజాన్ ప్రైమ్ లో విడుద‌ల కాబోతున్న సంగ‌తి తెలిసిందే. వ‌రుస‌గా రెండు సినిమాలు (నార‌ప్ప‌, దృశ్యం 2) ఓటీటీకి వెళ్లిపోవ‌డంతో వెంకీ ఫ్యాన్స్ కాస్త ఫీల‌వుతున్నారు. కానీ వెంకీ మాత్రం `నా ఫ్యాన్స్ అలాంటివేం ప‌ట్టించుకోరు` అంటున్నాడు. ”నా అభిమానుల‌కు నాపై పెద్ద‌గా అంచనాలు ఏమీ ఉండ‌వు. అందుకే నేను నా వంతు ప్ర‌యోగాలు చేస్తుంటా. రెండు సినిమాలు ఓటీటీలో వ‌చ్చాయి. ఈసారి థియేట‌ర్లో చూడ‌ద‌గ్గ సినిమా ని విడుద‌ల చేస్తా. ఎఫ్ 3ని హాయిగా థియేట‌ర్ల‌లోచూసుకోవ‌చ్చు. నా సినిమాలు ఓటీటీలోనే రావాల‌ని నేనేం ప్లాన్ చేయ‌లేదు. అవి వ‌చ్చాయి. అంతే. ఓటీటీలో అయినా, థియేట‌ర్లో అయినా మంచి సినిమాని ప్రేక్ష‌కుల‌కు ఇవ్వాల‌న్న‌దే ఆ ఆశ‌” అన్నారు వెంకీ.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘లైగ‌ర్‌’లో అదిరిపోయే ఐటెమ్ సాంగ్‌.. మ‌రి ఎవ‌రితో?

పెద్ద సినిమా అంటే ఐటెమ్ గీతం మ‌స్ట్ అయిపోయింది. `పుష్ప‌` లో స‌మంత ఐటెమ్ గీతం ఎంత మైలేజ్ ఇచ్చిందో తెలిసిందే. సినిమాల‌కు అది అద‌నపు ఆక‌ర్ష‌ణ అయిపోతోంది. `లైగ‌ర్‌` కోసం కూడా...

తెలంగాణ కంటే ఏపీకి రెట్టింపు పన్నుల వాటా రిలీజ్ చేసిన కేంద్రం !

ఏపీకి నిధుల విషయంలో అన్నీ కలసి వస్తున్నాయి. ధనిక రాష్ట్రం.. కేంద్రానికి పెద్ద ఎత్తున పన్నులు సంపాదించి పెట్టే తెలంగాణ కంటే.. రెట్టింపు పన్నుల వాటా నిధులు ఏపీకి వస్తున్నాయి. కేంద్రం తాజాగా...

మ‌ళ్లీ రంగంలోకి దిగుతున్న చిరు

క‌రోనా థ‌ర్డ్ వేవ్ ప్ర‌భావం తీవ్రంగా ఉండ‌డంతో అగ్ర క‌థానాయ‌కులంతా ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. షూటింగుల‌కు రామ‌ని చెప్పేశారు. చిరంజీవి కూడా త‌న చేతిలో సినిమాల‌న్నీ ప‌క్క‌న పెట్టేశారు. ఇప్పుడు మ‌ళ్లీ ఆయ‌న మేక‌ప్...

పెద్ద బ్యాన‌ర్ల చేతిలో ప‌డిన శ్రీ‌కాంత్ త‌న‌యుడు

ఈమ‌ధ్య పెద్ద బ్యాన‌ర్లు చిన్న సినిమాల‌పై దృష్టి నిలిపాయి. `జాతిర‌త్నాలు`తో చిన్న‌సినిమాల వ‌ల్ల ఉన్న లాభాలేమిటో అశ్వ‌నీద‌త్ లాంటి అగ్ర నిర్మాత‌కు బాగా అర్థ‌మైంది. అందుకే ఇప్పుడు మ‌రో చిన్న సినిమాకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close