విడదల రజనీ పార్టీ మారుతున్నారట. ఏ పార్టీనో ఎవరికీ తెలియదు. విడదల రజనీకి అయినా తెలుసో లేదో. ఆమె వర్గీయులే మీడియాకు ఈ సమాచారం ఇచ్చారు. మీడియా వాళ్లు ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే.. జగన్ రెడ్డి రేపల్లెకు ఇంచార్జ్ గా వెళ్లమన్నారని.. తనకు ఇష్టం లేనందున ఆమె పార్టీ మారాలనుకుంటున్నారని అంటున్నారు.
ఘోరంగా ఓడిపోయిన పులకేశీ తరహాలో పార్టీ నడుపుతున్న జగన్ తత్వాన్ని విడదల రజనీ తట్టుకోలేకపోతున్నారు. చిలుకలూరిపేట నుంచి గుంటూరు.. అక్కడ నుంచి మళ్లీ చిలుకలూరిపేట.. పంపారు. ఇప్పుడు మళ్లీ ముక్కూ ముఖం తెలియని రేపల్లె ప్రాంతానికి పంపిస్తున్నారు. అయితే తాను రాజకీయాలకు కొత్తే కానీ ప్రతీ సారి బలవడానికి సిద్ధంగా లేనని ఆమె లైట్ తీసుకున్నారు. అలా చెప్పినప్పటి నుంచి చిలుకలూరిపేట వైసీపీలో కూడా కనిపించడం లేదు.
ఇప్పుడు ఆమె తనను చిలుకలూరిపేటలోనే కొనసాగిస్తారా లేకపోతే పార్టీ మారిపోవాలా అన్న సంకేతాలను మీడియా ద్వారా విడదల రజనీ జగన్ కు.. సజ్జలకు పంపారు. వారు రజనీ లాంటి లీడల్ లేకపోతే కష్టమవుతుందని అనుకుంటే బుజ్జగించి.. పేట ను రాసిస్తాం ఎక్కడికి పోకండి అంటే.. ఆమె పార్టీ మార్పు ఆగిపోతుంది. ఒక వేళ అలా అనకపోతే ఏ పార్టీలో చేరుతారు.. జనసేన, బీజేపీ ఆప్షన్లు ఉన్నాయి. వాళ్లతో టచ్ లోకి వెళ్లారో లేదో తెలియదు. వెళ్లినా కూటమి లో అన్ని పార్టీల నేతల ఆమోదంతోనే జరగాలి. అది సాధ్యమవుతుందా?