మాజీమంత్రి , వైసీపీ నాయకురాలు విడదల రజిని పీఆర్వో శ్రీకాంత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె ఏదో పర్యటనకు వెళ్తుండగా కారును ఆపి, కారులో ఉన్న శ్రీకాంత్ ని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా విడదల రజిని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అసలు ఏ కేసులో శ్రీకాంత్ ను అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని రోడ్డుపై రచ్చ చేశారు.
సోషల్ మీడియా పోస్టింగ్ కు సంబంధించి శ్రీకాంత్ ను అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే, ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని పోలీసులతో అదేపనిగా రజిని వాగ్వాదానికి దిగడం చర్చనీయాంశం అవుతోంది.పీఆర్వోను పోలీసులు అరెస్ట్ చేస్తే అతన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలుసుకొని , స్టేషన్ కు వెళ్లాక మాట్లాడుకోవచ్చు..కానీ ఆమె అలా చేయలేదు. మంత్రిగా పని చేసిన రజిని రోడ్డుపైనే పోలీసులతో వాగ్వాదానికి దిగడం హాట్ టాపిక్ గా మారింది.
విడదల రజినిపై ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు అయింది. పల్నాడు జిల్లాలో స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి అక్రమంగా డబ్బులు సంపాదించారని ఆమెపై ఆరోపణలు వచ్చాయి. ఏకంగా 2.20కోట్లు అక్రమంగా వసూలు చేశారని అభియోగం ఆమెపై ఉంది. ఈ నేపథ్యంలోనే ఆమెపై కేసు నమోదు కావడం.. సడెన్ గా ఆమె పీఆర్వోను అరెస్ట్ చేయడంతో రజిని ఉలిక్కిపడినట్లుగా తెలుస్తోంది.
ఈ అక్రమ వసూళ్ల బాగోతం శ్రీకాంత్ కు తెలిసి ఉంటుందని, అందుకే అతని అరెస్ట్ చేసి ఉంటారని అనుమానంతోనే రోడ్డుపై పోలీసులతో రజిని వాగ్వాదానికి దిగి ఉంటుందని అంటున్నారు. ఇదే కేసులో శ్రీకాంత్ ను అరెస్ట్ చేసి ఉంటే తనకు ఇబ్బంది అవుతుందని ఆమె రోడ్డుపై రచ్చ చేసిందని టాక్ నడుస్తోంది. కానీ, అతని సోషల్ మీడియా పోస్టింగ్ కేసులో అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది.