జగన్ ప్రారంభించిన డిజిటల్బుక్లోకి ఆ పార్టీ నేత విడుదల రజనీ ఎక్కేశారు. ఆ బుక్లోకి తమను వేధించిన ఇతర పార్టీల వారిని ఎక్కించాలని జగన్ ప్రారంభించారు. కానీ వైసీపీ నేతలు కొంత మంది తమ నేతల బాధలు భరించలేక .. సొంత వారి పేర్లే ఎక్కిస్తున్నారు.
చిలుకలూరిపేటలో ఎన్నో అరాచకాలు చేసిన విడుదల రజనీ టీడీపీ వారినే కాదు.. సొంత పార్టీకి అండగా ఉండే వారిని కూడా టార్గెట్ చేశారు. నవతరం పార్టీ అనే పేరుతో ఓ ఊరూపేరూ లేని పార్టీ పెట్టుకున్న రావు సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి రజనీపై డిజిటల్ బుక్ లో ఫిర్యాదు చేశారు. 2022లో మంత్రిగా ఉన్నప్పుడు రజనీ తన కార్యాలయం, ఇల్లుపై తన అనుచరులు, రౌడీషీటర్లతో దాడులు చేయించారని ఆయన అందులో ఫిర్యాదు చేశారు. ఆధారాలు కూడా జత చేశారు. రజనీపై చర్యలు తీసుకుంటేనే కార్యకర్తలకు నమ్మకం ఉంటుందని సుబ్రహ్మణ్యం అంటున్నారు
చిలుకలూరిపేటలో ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసిన విడుదల రజనీపై ఇప్పటికి పదుల కొద్దీ ఫిర్యాదులు పోలీసులకు అందాయి. ఆమె మరిదిని అరెస్టు కూడా చేశారు. స్వయంగా రజనీపైనే కేసులు నమోదయ్యాయి. అయితే మహిళల్ని అరెస్టు చేయకూడదన్న రూల్ పెట్టుకోవడంతో ఆమెకు న్యాయపరమైన అవకాశాలు కల్పించారు. అయితే.. సొంత పార్టీ నుంచి సైతం ఆమెపై ఫిర్యాదులు తప్పడం లేదు. ఆమె చేసిన దందాల కారణంగా పేటలో అయితే గెలలేరని గుంటూరుకు పంపించారు. అక్కడ అసలు ఘోరంగా ఓడిపోవడంతో..తనకు పేటనే మంచిదని చెప్పి మళ్లీ అక్కడికే ఇంచార్జ్ గా వెళ్లి రాజకీయాలు చేస్తున్నారు.