రౌడీ… మేకొవ‌ర్ అదిరిపోతోంది!

డియ‌ర్ కామ్రేడ్‌, వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ రిజ‌ల్ట్‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యాన్స్ డీలా ప‌డిపోయారు. ఈ రెండు సినిమాల్లోనూ విజ‌య్ న‌ట‌న వంక పెట్టలేనంత బాగున్నా, ఆర్థిక ప‌ర‌మైన విజ‌యాలుసాధించ‌లేక‌పోయాయి. వాళ్ల ధైర్యం.. పూరి జ‌గ‌న్నాథే. ఎందుకంటే విజ‌య్ త‌దుప‌రి సినిమా పూరీతోనే. పూరి ఏదైనా చేయ‌గ‌ల స‌మ‌ర్థుడు. స్టార్లున్నా, లేకున్నా సంచ‌ల‌నాలు సృష్టించ‌డం అల‌వాటు చేసుకున్నాడు. రౌడీ లాంటి హీరో దొరికితే రెచ్చిపోవడం ఖాయం. పూరి ఫామ్ లోకి వ‌చ్చి సినిమా తీస్తే ఎలా ఉంటుందో `ఇస్మార్ట్ శంక‌ర్‌` నిరూపించింది. అదే ఊపులో విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమా మొద‌లెట్టాడు.

ప్ర‌స్తుతం ముంబైలో షూటింగ్ జ‌రుగుతోంది. పూరి మేకింగ్ స్టైల్ గురించి తెలియంది కాదు. సినిమాని ఎప్పుడు ప్రారంభిస్తాడో, ఎప్పుడు పూర్తి చేస్తాడో తెలియ‌నంత వేగంగా ప‌ని చేస్తాడు. విజ‌య్ సినిమానీ చ‌క చ‌క పూర్తి చేస్తున్నాడు. ముంబై షెడ్యూల్‌లో ఇప్ప‌టికే 20 నిమిషాల నిడివి ఉన్న సినిమా తీసేశాడ‌ట పూరి. ఈ 20 నిమిషాల్లోనూ విజ‌య్‌పైనే కీల‌క స‌న్నివేశాలు తెర‌కెక్కించాడు. అందులో విజ‌య్ దేవ‌ర‌కొండ మేకొవ‌ర్ చూస్తే… షాకింగ్‌గా అనిపిస్తోంద‌ట‌. ఈ సినిమాతో స‌రికొత్త విజ‌య్‌ని చూడ‌డం ఖాయ‌మ‌ని స‌న్నిహిత వ‌ర్గాలు తెలిపాయి. ఈ సినిమా కోస‌మే మార్ష‌ల్ ఆర్ట్స్‌లో విజ‌య్ శిక్ష‌ణ తీసుకున్నాడు. దానికి తోడు యాక్ష‌న్ స‌న్నివేశాలు తెర‌కెక్కించ‌డంలో పూరి దిట్ట‌. అందుకే యాక్ష‌న్ ఎపిసోడ్స్ అదిరిపోయేలా వ‌చ్చాయ‌ని, ఈ సినిమాకి అవే పెద్ద హైలెట్ అని తెలుస్తోంది. ఇస్మార్ట్ శంక‌ర్‌తో క‌థ‌ని చెప్పే విధానంలోనూ పూరి మారాడు. ఆ మార్పు ఈ సినిమాలోనూ క‌నిపించ‌బోతోంద‌ని తెలుస్తోంది. మొత్తానికి పూరి – రౌడీల కాంబో… స‌రికొత్త సంచ‌ల‌నాలు సృష్టించబోతుంద‌న్న సంకేతాలు ముందే అందేస్తున్నాయి. ఫైన‌ల్ అవుట్‌పుట్ ఎలా ఉంటుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మాధవీలత ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాధవీలత ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పాతబస్తీ గడ్డపై బీజేపీ ఎగరేసి ఒవైసీకి ఓటమి రుచి చూపిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు....

ఎన్నికల వరకు జగన్ అంతే..!?

ఏపీ సీఎం జగన్ రెడ్డిపై రాయి దాడి జరిగి రెండు వారాలు కావొస్తోంది. బస్సు యాత్రలో భాగంగా ఓ వ్యక్తి రాయి విసరడంతో జగన్ ఎడమ కంటిపైన స్వల్ప గాయమైంది. బ్యాండేజ్...

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close