‘లైగర్’ ఫలితం నుంచి వీలైనంత త్వరగా బయటపడదామని చూస్తున్నాడు విజయ్ దేవరకొండ. పనిలోనే రిలాక్సేషన్ ఉంది కాబట్టి… వెంటనే షూటింగులు మొదలెట్టేద్దామని భావిస్తున్నాడు. బుధవారం ఓ యాడ్ షూట్ ఉంది. అందులో పాల్గొనబోతున్నాడు విజయ్. గురువారం నుంచి ‘ఖుషి’ కొత్త షెడ్యూల్ మొదలు కానుంది. అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో ఈ షూటింగ్ జరగబోతోంది. విజయ్ పై కొన్ని కీలకమైన సన్నివేశాలు తెరకెక్కించబోతున్నారు. ఈ వారమంతా… విజయ్ ‘ఖుషి’ షూటింగ్‌లోనే గడపబోతున్నాడు. ఆ తరవాతి వారంలో సమంత జాయిన్ కానుంది. సమంత డేట్లు ఇప్పుడు కాస్త అటూ ఇటూగా ఉన్నాయి. సమంత వచ్చే వారం సెట్లోకి వస్తే ‘ఖుషి’ షూటింగ్ కొనసాగుతుంది. లేదంటే మరో బ్రేక్ ఏర్పడుతుంది. ఒకవేళ సమంత రాకపోతే.. విజయ్ కూడా వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోబోతున్నాడని తెలుస్తోంది. ఈమధ్య విజయ్ నడుం నొప్పితో బాధ పడుతున్నాడు. దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కేరళలో తీసుకోవాలనుకుంటున్నాడట. ఒకవేళ సెప్టెంబరు 2వ వారంలో… సమంత డేట్లు దొరక్కపోతే, విజయ్ కేరళ వెళ్తాడు. అక్కడ నేచర్ క్యూర్ ట్మీట్రెంట్ ద్వారా నడుం నొప్పికి చికిత్స తీసుకోబోతున్నాడు.