తమిళనాడు విజయ్ ప్రచారయాత్రలో జరిగిన తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురి చేసింది. రాష్ట్రపతి, ప్రధాని కూడా సంతాపం వ్యక్తం చేశారు.తమిళనాడు ముఖ్యమంత్రి వెంటనే స్పందించారు. అధికారయంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఆదివారం ఉదయమే కరూరు వెళ్లి బాధితుల్ని పరామర్శించారు. అయితే అందరికీ వచ్చిన డౌట్.. ఇంతకీ విజయ్ ఎక్కడ అని ?
ఘటన జరిగిన వెంటనే విజయ్ కరూర్ నుంచి వెళ్లిపోయారు. నేరుగా తిరుచ్చి ఎయిర్ పోర్టుకు వెళ్లిపోయి అక్కడ్నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై వెళ్లిపోయారు. ఇంటికెళ్లిన తర్వాత తన గుండె పగిలిపోయిందని ట్వీట్ పెట్టారు. విజయ్ చెన్నై వెళ్లిపోయాడని తెలిసి ఆయన ఫ్యాన్స్ ఇంకా దిగ్భ్రాంతికి గురయ్యారు. తన సమక్షంలో ఇంత ఘోర ప్రమాదం జరిగితే.. కనీసం పట్టించుకోకుండా ఆయన దోవన ఆయన వెళ్లిపోవడం ఏమిటన్న విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. పొలిటికల్ యాక్టివిజం ఎక్కువగా ఉండే తమిళనాడులో ఇక ఇలాంటి తప్పు జరిగిదే ఊరుకుంటారా?
విజయ్ సినిమా హీరో. ఇలాంటివి జరిగినప్పుడు ఆయన రియల్ హీరోయిజం చూపించాలని అందరూ కోరుకుంటారు. పరిస్థితి చక్కబడేవరకూ అక్కడే ఉండి..బాధితులకు అండగా నిలుస్తారని అనుకుంటారు. కానీ ఆయన అభిమానుల అంచనాలను తలకిందులు చేశారు. బహుశా అక్కడ బాధితులు ఆగ్రహంతో ఉంటారని అక్కడ ఉండకపోవడమే మంచిదని ఎవరైనా సలహాలు ఇచ్చారేమో కానీ.. వెంటనే వెళ్లిపోయారు. ఈ ఘటన ఆయన రాజకీయ జీవితంలో పెనుమచ్చగా మారనుంది.