రాజకీయ సభలకు వచ్చే వారందరూ ఓట్లేస్తారా .. ఈ ప్రశ్న ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. టీవీకే అధ్యక్షుడు విజయ్ సభకు జనం బాగా వస్తున్నారు. అయితే రాజకీయాలపై కనీస అవగాహన ఉన్న వారికి .. అలా వచ్చే ప్రజలు అంతా ఓట్లు వేయరని అంటున్నారు. ఇదే విషయాన్ని విజయ్ ఓ సభలో ప్రస్తావించారు. మీరంతా ఓట్లు వేయరని అంటున్నారు.. నిజమేనా అని అడిగారు. దానికి వారంతా వేస్తామని చెప్పారు. దీనిపై అనేక మంది అనేక రకాల అభిప్రాయాలు చెప్పారు.
కమల్ హాసన్ కూడా అలా వచ్చే వారు అంతా ఓట్లు వేయరని ఇది ఇది అందరికీ వర్తిస్తుందన్నారు. సినిమా వాళ్ల సభలకు వచ్చే జనాలను అసలు ఓటర్లుగా పరిగణించడానికి కూడా రాజకీయవర్గాలు అంగీకరించవు. విజయ్ సూపర్ స్టార్. ఆయన ఇంకా సినిమాలు చేస్తూనే ఉన్నారు. తమిళనాట సినీ స్టార్లకు ఉండే ఆదరణ గురించి చెప్పాల్సిన పని లేదు. ఆయనను చూసేందుకు పెద్దఎత్తున జనం రావడంలో వింత లేదు.. విచిత్రం కూడా కూడా.రాజకీయంగా అది బలం కూడా కాదనేది ఎక్కువ మంది అభిప్రాయం.
కానీ ఇలా వచ్చే జనం ఆయనపై ఓ పాజిటివ్ బజ్ ను తీసుకు వస్తుంది .కానీ ఓట్లు తీసుకు రావు. రాజకీయ సమీకరణాలను కేవలం అభిమానంతో అంచనా వేయడం అసాధ్యం. సినీ అభిమానంతో ఓట్లు వేసే వారిలో కొంత మంది యువత మాత్రమే ఉంటారు. ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలనుకున్నవారు ఖచ్చితంగా సినీ హీరో ఉన్న నేపధ్యం మాత్రమే చూడరు. విజయ్ కు వచ్చే జనం ఆర్గానిక్ కావొచ్చు కానీ..అది సినీ క్రేజ్ మాత్రమే అవుతుంది. దాన్ని ఓట్లుగా మల్చుకోవాలంటే.. విజయ్ ఇంకా చాలా కసరత్తు చేయాల్సి ఉంటుంది.
పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేసుకుని ఓట్లు వేయించుకునే వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. లేకపోతే.. అవి ఓట్లుగా మారవు. చరిత్రలో ఇది చాలా సార్లు నిరూపితమయింది.
