వైసీపీ సోషల్ మీడియా టీంకు విజయసాయి భరోసా..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా బృందాలకు విజయసాయిరెడ్డి మంచి ట్రీట‌్ చేస్తున్నారు. పార్టీ తన చేతి నుంచి జారిపోయినా.. సోషల్ మీడియా మాత్రం విజయసాయిరెడ్డి చేతుల్లోనే ఉంది. ఇటీవలి కాలంలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. కోర్టులపై చేసిన అనుచిత వ్యాఖ్యలే దీనికి కారణం. సీబీఐ విచారణ కూడా ప్రారంభమయింది. కోర్టులపై చేసిన వ్యాఖ్యలుఅన్నీ ఆర్గనైడ్డ్‌గా జరగడంతో… తాము ఇరుక్కుపోతామనే భావన చాలా మంది వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల్లో ఉంది. అందుకే.. వారి ఇటీవలి కాలంలో తమ జోరు తగ్గించారు. దీంతో విజయసాయిరెడ్డి.. అందర్నీ మళ్లీ కార్యోన్ముఖుల్ని చేయాలని నిర్ణయించుకున్నారు.

తాడేపల్లిలో..అన్ని రాష్ట్రాల సోషల్ మీడియా సపోర్టర్స్‌ను పిలిచి తాడేపల్లిలో రెండు రోజులుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో తానున్నానని భరోసా ఇస్తున్నారు. ఎవరికీ ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటానని హామీ ఇస్తున్నారు. వైసీపీ అధికారంలోకి రావడానికి .. సోషల్ మీడియానే కీలకమని.. అందుకే… ముఖ్యమంత్రి జగన్.. వారికి ఇచ్చిన అన్ని హామలను నెరవేర్చడానికి సిద్ధంగామని విజయసాయిరెడ్డి వారికి ధీమా కల్పించే ప్రయత్నం చేశారు. ఎనిమిది నుంచి పదివేల మంది వరకూ సోషల్ మీడియా కార్యకర్తలు ఉన్నారని.. అందరికీ ఇచ్చిన హమీలు నెరవేరుస్తామని చెప్పుకొచ్చారు.

తిట్లు, శాపనార్థాలు, దాడులతో వైసీపీ సోషల్ మీడియా.. కీలకంగా మారింది. ఇలాంటి సమయంలో.. కోర్టుధిక్కరణ వంటి కేసులు పెడితే.. వ్యవస్థ మొత్తం కొలాప్స్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే విజయసాయిరెడ్డి… సోషల్ మీడియాపై ప్రత్యేక దృష్టి పెట్టి పోరాట చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ అంశంలో ఆదినారాయణకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close