అల్లు అర్జున్‌ను కాకా పడుతున్న విజయసాయిరెడ్డి

పుష్ప సినిమా విడుదలయినప్పుడు ఏపీలో టిక్కెట్ల రచ్చ జరుగుతోంది. అతి తక్కువ టిక్కెట్ రేట్లు అప్పుడు ఉన్నాయి. అయితే పుష్ప టీం.. తమ సినిమాపై నమ్మకంతో విడుదల చేశారు. ఈ సినిమాకూ ఏపీలో ఆటంకాలు ఎదురయ్యాయి. కానీ ఇప్పుడు పుష్పని విజయసాయిరెడ్డి పొగుడుతున్నారు. దీనికి కారణం సైమా అవార్డులు ఎక్కువగా పుష్పకే వచ్చాయి. ఈ అవార్డులు వచ్చి రెండు రోజులు అయిన తర్వాత అభినందన ట్వీట్ పెట్టారు. సినిమా రిలీజయినప్పుడు ఇబ్బందులు పెట్టి.. ఆ తర్వాత దేశవ్యాప్తంగా హిట్ అయినా ఒక్క మాట మాట్లాడకుండా ఇప్పుడు ప్రైవేటు అవార్డులు వస్తే అభినందిస్తూ ట్వీట్ పెట్టడం ఏమిటని అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆయనను సోషల్ మీడియాలోనే ప్రశ్నిస్తున్నారు.

విజయసాయిరెడ్డి కొద్ది రోజులుగా తనదైన మార్క్ బూతు ట్వీట్లకు దూరంగా ఉంటున్నారు. మోడీని..బీజేపీని కాకా పట్టడానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. తన ట్విట్టర్‌ ఖాతాను కార్పొరేట్ ఏజెన్సీకి అప్పగించి.. బీజేపీకి ఎలా అవసరం అయితే అలా ట్వీట్లు పెట్టుకోమని చెప్పినట్లుగా ఉన్నారు. బీజేపీని పొగుడుతూ కాంగ్రెస్‌ను తిడుతూ ఆయన ట్వీట్లు పెడుతున్నారు.

పాదయాత్రలో రాహుల్ కంటెయినర్అంటూ ఓ లగ్జరీ వీడియోను పోస్ట్ చేశారు. దానిపైనా నెటిజన్లు మండిపడుతున్నారు. తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండి పడుతున్నారు. కానీ విజయసాయిరెడ్డి మాత్రం తీరు మార్చుకోలేదు. పెట్టిన తెలుగు ట్వీట్ అర్జున్‌ను కాకా పట్టడానికి చేసినట్లుగా ఉండటంతో ఆయనపై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. కానీ ఇలాంటివి ఆయన పట్టించుకోరు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close