ఢిల్లీ బీజేపీ కోసం పరితపిస్తున్న విజయసాయిరెడ్డి !

ప్రధాని మోడీ ఏం చేసినా ఆహా .. ఓహో అనడానికి విజయసాయిరెడ్డి ఎప్పుడూ ట్విట్టర్‌లో ఆన్‌లైన్‌లో ఉంటున్నారు. రోజువారీగా తాను చేస్తున్న ట్వీట్లలో కొన్ని సీ గ్రేడ్ సోషల్ మీడియా కార్యకర్తలు చేసే మార్ఫింగ్ పోస్టులు ఉంటూండగా.. మిగతావి మాత్రం కేంద్రాన్ని.. కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించేవి ఉంటున్నాయి. అదే సమయంలో బీజేపీ రాజకీయ ఎజెండాను మోసే టాపిక్స్‌ను పోస్ట్ చేస్తున్నారు. బీజేపీ విజన్‌కు దగ్గరగా ఉండేలా రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారు. తన కృషి ఫలించేలా… తాను బీజేపీ దృష్టిలో పడేలా ఆయా ట్వీట్లను ఇంగ్లిష్‌లోనే చేస్తున్నారు.

విజయసాయిరెడ్డి చేసే ట్వీట్లలో తమ పార్టీ , ప్రభుత్వం చేసే గొప్పలేమీ ఉండవు. పూర్తిగా టీడీపీని, చంద్రబాబును… లోకేష్‌ను వ్యక్తిగతంగా విమర్శలే ఉంటాయి. బీజేపీని ఎట్రాక్ట్ చేయడానికీఅదే విధానం ఎంచుకున్నారు. ఆయన ట్వీట్లు చూసిన చాలా మంది.. ఆయన బీజేపీనా.. వైఎస్ఆర్‌సీపీ అన్న డౌట్స్ కూడా వ్యక్తం చేస్తూ ఉంటారు. అయితే విజయసాయిరెడ్డి బాధ విజయసాయిరెడ్డిదని మరికొంత మంది కవర్ చేస్తూ ఉంటారు.ఆయన పోస్టులకు ఒకటి రెండు కూడా పాజిటవ్ కామెంట్స్ రావు. అది వేరే సంగతి. ఆయన బ్లాక్ చేయగలిగిన వారినందర్నీ బ్లాక్ చేశారు.

ఇంకా చేయడం ఎందుకని ఆగిపోయినట్లుగా ఉన్నారు. అయితే విజయసాయిరెడ్డి చేసే ట్వీట్లకు టీడీపీ నేతలు కౌంటర్ ట్వీట్లు ప్రారంభించారు. నీవు నేర్పిన విద్యేనని ఆయన ఏ టాపిక్ మీద టీడీపీని విమర్శిస్తారో… అదే టాపిక్ మీద అంత కంటే దారుణంగా టీడీపీ నేతలు … తమ ట్వీట్లను పెడుతూంటారు. తాము అని..అనిపించుకోవడం మాత్రమే కాదు.. తమ నేతల్ని అనిపించడంలోనూ విజయసాయిరెడ్డి ముందు ఉంటారన్న సెటైర్లు సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉన్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

5 నెలల్లో రూ. 40వేల కోట్లు గల్లంతయ్యాయట !

ఏపీ బడ్జెట్ నిర్వహణ గురించి ప్రత్యేకంగా సర్టిఫికెట్లు ఇవ్వాల్సిన పని లేదు. బడ్జెట్ వ్యవహారం ఇప్పుడు కూడా నడుస్తోంది. ఈ ఐదు నెలల్లో రూ. నలభైవేల కోట్లకుపైగా లెక్కలు తెలియడం లేదని గగ్గోలు...

‘గాడ్ ఫాద‌ర్‌’ హిట్‌… నాగ్ హ్యాపీ!

ఈ ద‌స‌రాకి మూడు సినిమాలొచ్చాయి. గాడ్‌ఫాద‌ర్‌, ది ఘోస్ట్‌, స్వాతిముత్యం. గాడ్ ఫాద‌ర్‌కి వ‌సూళ్లు బాగున్నాయి. స్వాతి ముత్యంకి రివ్యూలు బాగా వ‌చ్చాయి. ది ఘోస్ట్ కి ఇవి రెండూ లేవు....

వైసీపీ సర్పంచ్‌ల బాధ జగన్‌కూ పట్టడం లేదు !

వారు వైసీపీ తరపున సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. ప్రత్యర్థి పార్టీనో.. సొంత పార్టీలో ప్రత్యర్థుల్నో దెబ్బకొట్టడానికి పెద్ద ఎత్తున ఖర్చు పెట్టుకున్నారు. గెలిచారు. కానీ ఇప్పుడు వారికి అసలు సినిమా కనిపిస్తోంది. వీధిలైట్...

చిరంజీవి ఫ్యాన్స్ Vs బ్రాహ్మణ సంఘాలు..

చిరంజీవి ఫ్యాన్స్ Vs బ్రాహ్మణ సంఘాలు.. ఇప్పుడు బంతి... వాళ్లిద్ద‌రి చేతికీ చిక్కింది. ఇక ఆడుకోవ‌డ‌మే త‌రువాయి. అవును... అల‌య్ బ‌ల‌య్‌... కార్య‌క్ర‌మంలో చిరంజీవి - గ‌రిక‌పాటి మ‌ధ్య ఏం జ‌రిగిందో తెలిసింది. చిరుని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close