కేక్ క‌ట్ చేసి హ‌ర్ట్ చేసిన విజ‌య్ సేతుప‌తి

ఈరోజు విజ‌య్ సేతుప‌తి బ‌ర్త్ డే. త‌మిళంలో త‌నో పెద్ద స్టార్‌. తెలుగులోనూ అభిమానుల్ని ఏర్ప‌ర‌చుకుంటున్నాడు. అయితే.. త‌న పుట్టిన రోజున అనుకోని వివాదంలో ప‌డ్డాడు విజ‌య్ సేతుప‌తి. ఆ త‌ర‌వాత‌.. త‌న అభిమానుల‌కు `సారీ` చెప్ప‌డంతో- గొడ‌వ స‌ద్దుమ‌ణిగింది.

అస‌లేం జ‌రిగిందంటే… ఈరోజు విజ‌య్ సేతుప‌తి పుట్టిన రోజు సంద‌ర్భంగా.. సెట్లో కేక్ క‌ట్ చేశాడు. వెరైటీ కోస‌మ‌ని.. ఓ పెద్ద క‌త్తి తీసుకొచ్చి – కేక్ కోసేశాడు. ఆ ఫొటోలూ, వీడియోలూ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి కూడా. అయితే కొంత‌మంది అభిమానులు, ప్ర‌జా సంఘాలూ విజ‌య్ క‌త్తితో కేక్ కొయ్య‌డంలోనూ త‌ప్పులు వెదికారు. `గుండాల మాదిరిగా.. ఇలా క‌త్తుల‌తో కేక్‌లుక‌ట్ చేయ‌డ‌మేంటి? పుట్టిన రోజునాడు అభిమానుల‌కు ఎలాంటి సందేశాన్ని ఇవ్వ‌ద‌ల‌చుకున్నారు` అంటూ.. ఎదురు దాడికి దిగారు. త‌న అభిమానులే హ‌ర్ట్ అయిపోవ‌డంతో.. విజ‌య్ త‌న త‌ప్పుని స‌రిదిద్దుకునే ప్ర‌య‌త్నం చేశాడు. కేక్ ని అలా క‌ట్ చేసినందుకు `సారీ` చెబుతూనే అందుకు గ‌ల కార‌ణాన్ని వివ‌రించాడు. తాను ప్ర‌స్తుతం `పొన్రం` అనే ఓ త‌మిళ సినిమాలో న‌టిస్తున్నాన‌ని, అందులో ఖ‌డ్గానికి చాలా ప్రాధాన్యం ఉంద‌ని, అందుకే అలా క‌త్తితో కేక్ క‌ట్ చేయాల్సివ‌చ్చింద‌ని చెప్పుకొచ్చాడు. ఈ వ్య‌వ‌హారంలో ఎవ‌రైనా ఇబ్బంది ప‌డి ఉంటే.. క్ష‌మించాల‌ని కోరాడు. విజ‌య్ ఏదో అనుకుంటే.. ఇంకేదో అయ్యింది మేట‌రు. సోష‌ల్ మీడియాలో జ‌నాలు ఇలానే ఉంటారు. ఎప్పుడు ఏ విష‌యాన్ని నెగిటీవ్ కోణంలో చూస్తారో అస్స‌లు ఊహించ‌లేం. ఈ విష‌యం.. విజ‌య్ సేతుప‌తికి ఇప్పుడు తెలిసి ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉమెన్స్ డే రోజూ అమరావతి మహిళా రైతులకు దెబ్బలే..!

మహిళా దినోత్సవం రోజునా అమరావతి మహిళా రైతులకు ఎలాంటి గౌరవం లభించలేదు సరి కదా.. పోలీసులు చేతిలో దెబ్బలు తినాల్సి వచ్చింది. ఓ వైపు మహిళలకు అండగా నిలబడతామని పెద్ద పెద్ద ప్రకటనలు...

తొలి 10 నిమిషాలు ముందే చూపించేస్తార్ట‌!

మంచు విష్ణు క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం మోస‌గాళ్లు. ఇదో వైట్ కాల‌ర్ మోసం చుట్టూ తిరిగే క‌థ‌. టెక్నాల‌జీని వాడుకుంటూ... మోస‌గాళ్లు ఎలా రెచ్చిపోతున్నారో చెప్పే క‌థ‌. ట్రైల‌ర్ ఇటీవ‌లే విడుద‌లైంది. కాజ‌ల్,...

బాల‌య్య రైట్ హ్యాండ్‌.. జ‌గ్గూ భాయ్‌

లెజెండ్‌తో.. జ‌గ‌ప‌తిబాబులోని విల‌న్ విశ్వరూపం చూపించాడు. ఆ సినిమాతో జ‌గ‌పతి బాబు కెరీర్ ట‌ర్న్ అయిపోయింది. హీరోగా ఎంత సంపాదించాడో తెలీదు గానీ, విల‌న్ గా మారాక మాత్రం జ‌గ‌ప‌తి ఆస్తులు పెరిగాయి....
video

మ‌హిళా శ‌క్తి @ విరాట ప‌ర్వం

https://www.youtube.com/watch?v=dQ9S_uy-5sM విరాట‌ప‌ర్వం... ఈ సినిమా పేరు చెప్ప‌గానే ఓ ప్రేమ‌క‌థో, ఓ విప్ల‌వ గాథో, ఓ అభ్యుద‌య చిత్ర‌మో, ఓ సామాజిక స్పృహ ఉన్న ప్ర‌య‌త్న‌మో... అనిపిస్తోంది. పోస్ట‌ర్లూ అలానే ఉన్నాయి. అయితే.....

HOT NEWS

[X] Close
[X] Close