ఆ ఇద్ద‌రూ.. క‌మ‌ల్ కీ లొంగ‌లేదు

విజ‌య్ సేతుప‌తి, ఫ‌హ‌ద్ ఫాజిల్‌… ఇద్ద‌రూ ఇద్ద‌రే! న‌ట‌న‌, క్రేజ్‌లోనే కాదు, పారితోషికాలు అందుకోవడంలోనూ.. ఆ పై ష‌ర‌తులు విధించ‌డంలోనూ. ఇద్ద‌రిలో ఓ కామ‌న్ పాయింట్ ఉంది. ఇద్ద‌రూ ప్ర‌మోష‌న్ల‌కు రారు. వ‌చ్చినా `ఇంతిస్తే వ‌స్తాం` అని ష‌ర‌తు విధిస్తారు. పారితోషికంతో పాటు.. ప్ర‌చారం కోసం కూడా వాళ్ల‌కు స్పెష‌ల్ గా సొమ్ము ముట్ట‌జెప్పాలి.

ఉప్పెన‌లో భారీ పారితోషికం అందుకొని మ‌రీ న‌టించాడు విజ‌య్‌సేతుప‌తి. కానీ ఆ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో అణుమాత్రం కూడా క‌నిపించ‌లేదు. ప్ర‌మోష‌న్‌కి రావాలంటే రూ.75 ల‌క్ష‌లు ఇవ్వాల‌ని అడిగితే.. మైత్రీ మూవీస్ లైట్ తీసుకొంది.

పుష్ప‌లో.. ఫ‌హ‌ద్ క‌నిపించాడు. ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో ఫ‌హ‌ద్ లేడు. ప్ర‌మోష‌న్ల‌కు డ‌బ్బులు అడ‌గ‌డంతో… మైత్రీ ఫ‌హ‌ద్‌ని ప‌క్క‌న పెట్టింది. ఇప్పుడు వీరిద్ద‌రూ క‌లిసి `విక్ర‌మ్‌`లో న‌టించారు. క‌మ‌ల్ హాస‌న్ న‌టిస్తూ, నిర్మించిన సినిమా ఇది. ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లోనూ ఫ‌హ‌ద్‌, విజ‌య్ సేతుప‌తి లేనే లేరు. `విక్ర‌మ్‌` ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ఫ‌హ‌ద్‌, విజ‌య్ సేతుప‌తి రానే లేదు. క‌మ‌ల్ అంటే.. ఇద్ద‌రికీ గౌర‌వ‌మే. ఇద్ద‌రూ క‌మ‌ల్ ని చూసి, క‌మ‌ల్ లా న‌టించి ఎదిగిన‌వాళ్లే. కానీ… సినిమా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేస‌రికి.. వాళ్ల ష‌ర‌తులు వాళ్ల‌కున్నాయి. వారిద్ద‌రికీ పారితోషికంతో పాటు, ప్ర‌చారం కోసం కూడా డ‌బ్బులు ఇవ్వ‌డానికి క‌మ‌ల్ కూడా లైట్ తీసుకోవ‌డంతో… విజ‌య్‌, ఫ‌హ‌ద్ ఇద్ద‌రూ విక్ర‌మ్ ప్ర‌మోష‌న్ల‌కు ఎంచ‌క్కా డుమ్మా కొట్టేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంతకీ లాయర్లకు ఏపీ ప్రభుత్వం పెట్టిన ఖర్చెంత!?

కింది కోర్టుల, జిల్లా కోర్టులు, సీబీఐ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఇలా న్యాయస్థానాలన్నింటిలో ఏపీ ప్రభుత్వ కేసులు వందలు, వేలల్లో ఉంటాయి. కింది స్థాయిలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించుకుంటారు. కానీ హైకోర్టు,...

అమెరికాలో ఘోర ప్రమాదం – ముగ్గురు ప్రవాసాంధ్రులు మృతి !

అమెరకాలోని టెక్సాస్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో ముగ్గురు ప్రవాసాంధ్రులు చనిపోయారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) బోర్డు డైరెక్టర్ డాక్టర్ కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ భార్య యలమంచిలి వాణిశ్రీ, ఆయన ఇద్దరు...

కేసీఆర్ అంచనాల్ని అందుకోలేకపోయిన ప్రశాంత్ కిషోర్ !

ఐ ప్యాక్ అంటే తిరుగులేని పొలిటికల్ స్ట్రాటజీ కంపెనీ. దేశంలో ఉన్న ప్రతీ పార్టీ సేవలు అందుకోవాలని అనుకుంటుంది. ఐ ప్యాక్ కన్నా పీకే పైనే అందరికీ గురి. బెంగాల్ తర్వాత తాను...

సోషల్ మీడియాలోనూ దారి తప్పిన ఏపీ రాజకీయాలు !

తమలపాకుతో నువ్వకొటి అంటే.. తలుపు చెక్కతో నేను రెండు అంటా అన్నట్లుగా ఏపీలో రెండు పార్టీల నేతలూ.. సోషల్ మీడియా కార్యకర్తలు చెలరేగిపోతున్నారు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే రెండు పార్టీలకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close