తమిళనాడులో కొత్త పార్టీకి విజయ్ రెడీ !

తమిళనాడులో కొత్త పార్టీ పెట్టేందుకు విజయ్ రెడీ అయ్యారు.ఇప్పటికే తన అభిమాన సంఘాలన్నింటినీ విజయ్ మక్కల్ ఇయక్కం పేరుతో ఓ గొడుగు కిందకు తీసుకు వచ్చారు. ఆ సంఘాల సమావేశాన్ని నిర్వహించారు. 150 మంది నిర్వాహకులు పాల్గొన్నారు. సమావేశంలో పాల్గొన్నవారు విజయ్ రాజకీయ పార్టీ ప్రారంభించాల్సిందేనని డిమాండ్ చేశారు. విజయ్ కూడా గతానికి భిన్నంగా రాజకీయాలపై చర్చించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని రెడీ చేద్దామని ఆయన సూచించినట్ుగా తెలు్సతోంది.

మరో ఆరు నెలల్లో ఆయన కొత్త పార్టీ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని ఫ్యాన్స్ తో పాటు తమిళనాడు రాజకీయ పార్టీలు గట్టిగా నమ్ముతున్నాయి. పార్టీ పేరు ఖరారు చేసి నమోదు చేయనున్నారు. లోక్‌సభ ఎన్నికలు ముందుకు వచ్చేసినందున.. ఈ ఎన్నికల్లో ఎలాంటి జోక్యం చేసుకునే అవకాశం లేదని పూర్తిగా అసెంబ్లీ ఎన్నికలపైనే దృష్టి పెడతారని అంటున్నారు. విజయ్‌కు రాజకీయ లక్ష్యాలు ఉన్నాయి. గతంలో ఆయన పార్టీ పెడతారని ప్రచారం జరిగినప్పుడు దర్యాప్తు సంస్థలు ఆయన ఇళ్లు, కార్యాలయాలపై సోదాలు కూడా చేశాయి.

అయితే ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో వాక్యూమ్ ఉందని గట్టిగా నమ్ముతున్నారు. డీఎంకేకు గట్టి ప్రత్యర్థి అయిన పార్టీ లేదు. అన్నాడీఎంకే నాయకత్వలోపంతో ఉంది. బీజేపీకి పట్టు చిక్కడం లేదు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి ఎంత ఎలివేషన్లు ఇచ్చినా మీడియాకే పరిమితం అవుతోంది. ఇలాంటి సమయంలో విజయ్ తన పార్టీ సరైన ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని గట్టి నమ్మకంతో ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా?

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని సర్కార్ ప్రకటించినా... వాలంటీర్లలో అనుమానాలు ఇంకా అలాగే ఉన్నాయి. జులై మొదటి తేదీన సచివాలయం సిబ్బందితో ఫించన్ లు పంపిణీ చేసిన కూటమి ప్రభుత్వం.. వాలంటీర్ల అవసరం...

జ‌గ‌న్ కు ష‌ర్మిల సూటి ప్ర‌శ్న‌లు… జ‌వాబు చెప్పే ద‌మ్ముందా?

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ఆయ‌న చెల్లి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో వైసీపీ చేసిన ధ‌ర్నా, అక్క‌డ జ‌గ‌న్ చేసిన...

ట్రంప్‌కు అంత ఈజీ కాదు !

అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో...

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

HOT NEWS

css.php
[X] Close
[X] Close