ఆస్తుల్ని ఎన్సీఎల్టీలో కేసు వేసి లాక్కోవడంపై జగన్ రెడ్డి తల్లి మనస్తాపానికి గురయ్యారు. ఆమె న్యాయపోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. హైదరాబాద్ ఎన్సీఎల్టీ ఇచ్చిన తీర్పు .. అన్యాయంగా ఉందని, అధికారం లేకపోయినా తీర్పు ఇచ్చారని చెప్పి చెన్నై ట్రిబ్యునల్ ను.. విజయమ్మ ఆశ్రయించారు. సరస్వతి పవర్ సిమెంట్స్ వ్యవహారాలు అన్నీ చట్టబద్ధంగా జరిగాయని.. అన్నీ అయిపోయిన తర్వాత కుటుంబ వివాదాన్ని జగన్ రెడ్డి ఎన్సీఎల్టీకి తీసుకు వస్తే.. సంబంధం లేకపోయినా విచారించి జగన్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చారని విజయమ్మ అంటున్నారు.
సరస్వతి పవర్ కంపెనీ విషయంలో జగన్, భారతి .. విజయమ్మకు తమ వాటాలను గిఫ్ట్ డీడ్ కింద రాసిచ్చారు. డైరక్టర్లుగా తప్పుకున్నారు. అయితే షర్మిలకు ఆమె మద్దతు ఇస్తున్నారని.. తాము ఆమె నుంచి తాము ఆస్తుల్ని తాము వెనక్కి తీసుకుంటామని ఎన్సీఎల్టీని ఆశ్రయించారు. తాము వాటాల్ని రాసివ్వలేదన్నట్లుగా వాదించారు. అంటే తన తల్లి అక్రమంగా తమ ఆస్తుల్ని రాసుకుందన్నట్లుగా వాదించి.. ఎన్సీఎల్టీ నుంచి అనుకూల ఉత్తర్వులు తెచ్చుకున్నారు. ఈ పరిణామంతో విజయమ్మ షాక్ కు గురయ్యారు. ఈ అంశాన్ని ఇంతటితో ఆగకుండా.. అప్పీల్ కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
తల్లి, చెల్లికి రాసిచ్చిన ఆస్తుల విషయంలో జగన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు వైసీపీతో పాటు ఆయన కుటుంబంలోనూ చర్చనీయాంశం అవుతుంది. ఇలాంటి వివాదాలను ప్రజాజీవితంలో ఉన్న వారి ఇమేజ్ ను మసకబారుస్తాయి. అయినా జగన్ తల్లికి ఆస్తి ఇవ్వకూడదని పట్టుదలతో కోర్టులకు వెళ్లడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ఇంత చేసినా సరస్వతి పవర్ కంపెనీ అటాచ్ లో ఉంది. అక్రమంగా సంపాదించిన ఆస్తి అది. అయితే ఆ కంపెనీకిపెద్ద ఎత్తున భూములు ఉన్నాయి. అందుకే జగన్ కూడా రాసిచ్చినప్పటికీ వెనక్కి తీసుకోవాలని.. తల్లికి అన్యాయం చేసినా తప్పు లేదని అనుకుంటున్నారు.