సీబీఐ ఆఫీసర్ రాకుండానే కంప్లైంట్లు ప్రారంభించేసిన విజయసాయి..!

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి సీబీఐ ఫోబియా గట్టిగానే పట్టుకున్నట్లుగా ఉంది. హైదరాబాద్‌ సీబీఐ జాయింట్ డైరక్టర్‌గా.. హెచ్‌.వెంకటేష్ అనే అధికారిని నియమించబోతున్నారని.. తెలియగానే.. ఆయన ఉలిక్కిపడ్డారు. వెంటనే.. నేరుగా.. ఎంపీ హోదాలో.. కేంద్రహోం మంత్రి అమిత్ షాకు.. హుటాహుటిన లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందని అధికారిని సీబీఐ జేడీగా నియమించాలని అందులో కోరారు. హెచ్‌ . వెంకటేష్ అనే అధికారిని నియమించబోతున్నట్లుగా తెలిసిందని.. ఆయన సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ సన్నిహితులని.. పైగా ఆంధ్రప్రదేశ్ వ్యక్తి అని..అమిత్ షాకు లేఖలో చెప్పారు విజయసాయిరెడ్డి.

నిజానికి విజయసాయిరెడ్డి చెప్పిన హెచ్. వెంకటేష్ కర్ణాటక వ్యక్తి. ఈ విషయాన్ని విజయ సాయిరెడ్డే తన లేఖలో చెప్పుకొచ్చారు. ఆయన కర్ణాటకకు చెందిన వ్యక్తి అయినప్పటికీ.. ఆయన మూలాలన్నీ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయని.. ఆయన తల్లిదండ్రులు తెలుగు వాళ్లని చెప్పుకొచ్చారు. వి.వి. లక్ష్మీనారాయణ సీబీఐ జేడీగా ఉన్న కాలంలో ఆయన ఎస్పీగా పని చేశారని.. ఆయన చంద్రబాబు చెప్పినట్లుగా చేస్తారంటూ.. లేఖలో రాజకీయం చొప్పించారు. ఇంకా విశేషం ఏమిటంటే.. తన హయాంలో జరిగిన భారీ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు.. తనకు సన్నిహితులైన సీబీఐ అధికారుల్ని.. నియమించుకుంటున్నారట. హెచ్. వెంకటేష్ అనే అధికారి సీబీఐ జేడీగా రాకూడదన్న కారణంగా.. ఆయనపై.. వేయాల్సిన నిందలన్నింటినీ.. విజయసాయిరెడ్డి తన లేఖలో వేసినట్లుగా స్పష్టమవుతోంది.

విజయసాయిరెడ్డి బాధ అంతా.. అక్రమాస్తుల కేసులో సీబీఐ.. కఠినంగా వ్యవహరిస్తూండటమేనన్న ప్రచారం జరుగుతోంది. బెయిల్ షరతులు సడలించడానికి .. వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వడానికి కూడా.. సీబీఐ అంగీకరించడం లేదు. తీవ్రమైన ఆర్థిక నేరాలున్న వారికి మినహాయింపులొద్దని గట్టిగానే వాదిస్తోంది. ఏ విషయంలోనూ.. మెతకగా ఉండేందుకు సిద్ధపడటం లేదు. ఇది.. విజయసాయిరెడ్డికి నచ్చినట్లుగా లేదు. కఠినంగా ఉండే సీబీఐ అధికారి వస్తే.. ఎక్కడ ఇబ్బంది ఎదురవుతుందోనని… అనుకూలమైన అధికారి కోసం.. ముందుగానే.. వస్తారనుకున్న అధికారులపై.. కంప్లైంట్లు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. విజయసాయిరెడ్డి రాసిన లేఖను.. అమిత్ షా రొటీన్‌గా డీవోపీటీకి పంపారు. దీన్నే పబ్లిసిటీకి వాడుకున్నారు విజయసాయిరెడ్డి. మరి విజయసాయి వద్దంటున్న హెచ్. వెంకటేష్‌ను.. సీబీఐ జేడీగా కేంద్రం పంపుతుందో లేదా.. విజయసాయిరెడ్డి కోరుకునే జేడీని పంపుతుందో.. వేచి చూడాలి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆదర్శప్రాయ వ్యక్తిగా తనకు తాను సర్టిఫికెట్ ఇచ్చుకున్న తమ్మినేని..!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. తనను తాను ఆదర్శప్రాయ వ్యక్తిగా సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు. ఆదర్శ ప్రాయ వ్యక్తిగా.. స్పీకర్ హోదాలోనే కోర్టులపై కామెంట్లు చేశానని చెప్పుకొచ్చారు. న్యాయవ్యవస్థపై.. తమ్మినేని సీతారాం రెండురోజుల...

ఇక రామ్ చ‌ర‌ణ్… వెబ్ సిరీస్‌

రాబోయే రోజుల్లో వెబ్ సిరీస్‌లు వినోద రంగాన్ని ఆక్ర‌మించ‌బోతున్నాయి. సినిమాల్ని మించిన మేకింగ్‌, కంటెంట్‌తో వెబ్ సిరీస్‌లు ప్రేక్ష‌కుల‌కు వినోదాన్ని అందిస్తున్నాయి. వాటి ప్రాధాన్య‌త‌ని స్టార్లు ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. స‌మంత‌, త‌మ‌న్నా లాంటి...

బాల‌య్య‌తో అమ‌లాపాల్‌?

నంద‌మూరి బాల‌కృష్ణ - బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్ లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. `మోనార్క్‌` అనే పేరు ప‌రిశీల‌న‌లో ఉంది. బాల‌య్య పుట్టిన రోజున‌... ఓ ప‌వ‌ర్ ఫుల్ టీజ‌ర్ విడుద‌ల చేశాడు...

అమరావతి విషయంలో ప్రధానిపై భారం వేస్తున్న చంద్రబాబు..!

అమరావతి రైతుల ఉద్యమం ప్రారంభమై రెండు వందల రోజులు పూర్తయిన సందర్భంగా... దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు..వర్గాలు..మేధావుల నుంచి మద్దతు లభిస్తోంది. వర్చవల్ పద్దతిలో అందరూ.. పెద్ద ఎత్తున తమ సంఘిభావం తెలియచేస్తున్నారు....

HOT NEWS

[X] Close
[X] Close