విజయేంద్రప్రసాద్ డైరెక్షన్ లో సిద్ధమవుతోన్న సైంటిఫిక్ థ్రిల్లర్..

‘జానకిరాముడు, బొబ్బిలి సింహం, సమరసింహారెడ్డి, సింహాద్రి, సై, ఛత్రపతి, విక్రమార్కుడు’ సహా ఎన్నో సూపర్ హిట్ మూవీస్ కి కథను అందించిన స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్. ఈ ఏడాది భారతదేశం గర్వించే స్థాయిలో రూపొందిన విజువల్ వండర్ ‘బాహుబలి’, బాలీవుడ్ సెన్సేషనల్ హిట్ ‘భజరంగీ భాయ్జాన్’ చిత్రాలకు కూడా కథలను అందించారు. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన ‘బాహుబలి’తో రచయితగా తన పవర్ చాటిన విజయేంద్రప్రసాద్ ఈ ఏడాదినే బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘భజరంగీ భాయ్ జాన్’ చిత్రానికి స్టోరీని అందించి బాలీవుడ్ కి కూడా తెలుగువాడి సత్తాను చాటారు. రచయితగానే కాకుండా విజయేంద్రప్రసాద్ ‘రాజన్న’ వంటి హిట్ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో ఓ సైంటిఫిక్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది.

రేష్మాస్(Reshma’s) ఆర్ట్స్ బ్యానర్ పై రాజ్ కుమార్ బృందావన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ర‌జ‌త్‌క‌ష్ణ‌, మిస్ ఇండియా నేహ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణలో తుది దశకు చేరుకుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రాజ్ కుమార్ బృందావన్ మాట్లాడుతూ … ’’విజయేంద్రప్రసాద్ గారు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు అద్భుతమైన కథలను అందించడమే కాకుండా దేశభక్తి కూడుకున్న ‘రాజన్న’ వంటి చిత్రాన్ని డైరెక్షన్ చేశారు. రీసెంట్ ‘బాహుబలి’, ‘భజరంగీ భాయ్ జాన్’ వంటి రెండు సూపర్ డూపర్ హిట్ చిత్రాలకు కథలను కూడా అందించి నేషనల్ వైడ్ ఫేమస్ అయ్యారు. అలాంటి గొప్ప రచయిత, దర్శకుడుతో కలిసి మా బ్యానర్ లో సినిమా చేయడం చాలా హ్యపీగా ఉంది. చాలా డిఫరెంట్ పాయింట్ తో ఈ కథను విజయేంద్రప్రసాద్ గారు సిద్ధం చేశారు. కథ వినగానే వెంటనే సినిమా చేయడానికి రెడీ అయ్యాం. ప్రధానంగా ఈ చిత్రం ఒక సైంటిఫిక్ థ్రిల్లర్. ఇప్పటి వరకు మన తెలుగులో సైంటిఫిక్ చిత్రాలు వచ్చినప్పటికీ ఈ చిత్రం వాటన్నింటికంటే భిన్నంగా ఎక్సలెంట్ స్టోరీ, టేకింగ్ అండ్ మేకింగ్ లతో రూపుదిద్దుకుంటుంది. ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. సినిమా చాలా బాగా వస్తుంది. మా యూనిట్ అంతా చాలా ఎగ్జయిటెడ్ గా ఉన్నాం. త్వరలోనే సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జంధ్యాల స్టైల్‌లో `పేక మేడ‌లు`

'నా పేరు శివ', 'అంధగారం', 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాల్లో కీల‌క పాత్ర‌లు పోషించిన వినోద్ కిష‌న్ ఇప్పుడు హీరోగా మారాడు. ఆయ‌న న‌టించిన 'పేక మేడ‌లు' ఈనెల 19న విడుద‌ల‌కు సిద్ధంగా...

బీజేపీలో బీఆర్ఎస్ రాజ్యసభపక్షం విలీనం ?

బీఆర్ఎస్ రాజ్యసభ పక్షం బీజేపీలో విలీనం అయ్యేందుకు ఏర్పాట్లు పూర్తయినట్లుగా ఢిల్లీలో ప్రచారం ఊపందుకుంది. బీఆర్ఎస్ పార్టీకి ఉన్న నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరబోతున్నారు. ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఉపరాష్ట్రపతి,...
video

విజ‌య్ తెలివి.. ‘పార్టీ’ సాంగ్‌లో పాలిటిక్స్

https://www.youtube.com/watch?v=ygq_g7ceook త‌మిళ స్టార్ హీరో విజ‌య్ కొత్త‌గా పార్టీ స్థాపించిన సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే రాజ‌కీయ అరంగేట్రం చేయ‌బోతున్నాన‌ని, వ‌చ్చే త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించాడు. రాజ‌కీయాల‌కు ముందు త‌న చివ‌రి...

పొన్నవోలు వాదన జగన్‌కైనా అర్థమవుతుందా ?

రఘురామ ఫిర్యాదుతో జగన్ తో పాటు ముగ్గురు ఐపీఎస్ అధికారులపై కేసు నమోదయింది. ఇది తప్పుడు కేసు అని వాదించడానికి పొన్నవోలు మీడియా సమావేశం పెట్టారు. ఇందు కోసం తన టేబుల్ నిండా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close