పబ్లిసిటీ కోసమే రఘురామ పిటిషన్లు : విజయసాయి

బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై విజయసాయిరెడ్డి సీబీఐ కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. పిటిషన్ పబ్లిసిటీ కోసమే కోర్టుల్లో పిటిషన్లు వేస్తున్నారని కౌంటర్‌లో విజయసాయిరెడ్డి ఆరోపించారు. రఘురామపై చాలా సీబీఐ, క్రిమినల్ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. బెయిల్‌పై ఉన్న విజయసాయిరెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని.. న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపిస్తూ.. బెయిల్ రద్దు చేయాలని రఘురామకృష్ణరాజుసీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై కౌంటర్ వేయాలని కోర్టు సీబీఐతో పాటు విజయసాయిరెడ్డికి కూడా నోటీసులు ఇచ్చింది. సీబీఐ .. మెరిట్ ప్రకారం నిర్ణయం తీసుకోవాలని అఫిడవిట్ వేసింది.

విజయసాయిరెడ్డి ఇప్పుడు కౌంటర్ దాఖలు చేశారు. సీబీఐ కోర్టులో మంగళవారం విచారణ జరగనుంది. విజయసాయిరెడ్డి తన ఎంపీ హోదాను అడ్డు పెట్టుకుని తరచూ ఆర్థిక శాఖ అధికారుల్ని కలుస్తూ… సాక్ష్యుల్ని ప్రభావితం చేస్తున్నారని రఘురామ పిటిషన్‌లో ఆరోపించారు. అలాగే… అశోక్ గజపతిరాజుకు సంబంధించి మాన్సాస్ విషయంలో కోర్టు తీర్పు ఇచ్చిన సమయంలో న్యాయవ్యవస్థకు ఉద్దేశాలు ఆపాదిస్తూ వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. బెయిల్ పై ఉన్న వ్యక్తి ఇలా చేయడం నిబంధనల ఉల్లంఘనేనన్నారు .

అయితే విజయసాయిరెడ్డి రఘురామ పిటిషన్‌కు కౌంటర్‌గా ఆయనపై ఆరోపణలు చేయడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. పబ్లిసిటీ కోసం పిటిషన్ వేశారని.. కేసులున్ాయని చెప్పడం ద్వారా.. తన బెయిల్ రద్దు చేయకూదని ఎలా వాదిస్తారో కానీ… విజయసాయిరెడ్డి మాత్రం తాను బెయిల్ షరతులు ఉల్లంఘించలేదని గట్టిగా చెప్పడానికి తన కౌంటర్‌లో ప్రయత్నాలు చేయలేదు. రఘురామకు ఉద్దేశాలు ఆపాదిస్తే.. బెయిల్ పిటిషన్ కొట్టి వేస్తుందని విజయసాయిరెడ్డి భావిస్తున్నట్లుగా ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close