విజయసాయిరెడ్డికి సజ్జల పోస్ట్ ఎలా వచ్చింది..? దాదాపుగా పార్టీపై పూర్తి స్థాయి ఆధిపత్యం అంటే జిల్లాల అధ్యక్షులు..రీజనల్ కోఆర్డినేటర్లు ఇలా అందరూ విజయసాయి గ్రిప్‌లోకి వచ్చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డికి మిగిలింది మీడియా వ్యవహారాలు మాత్రమే. పూర్తిగా పక్కన పెట్టేశారని వైసీపీలోనే ప్రచారం జరిగింది. ఆయనపై జగన్ విశ్వాసం కోల్పోయారని.. ఆయనకు ఇక పార్టీలో ప్రాధాన్యం ఉండదని అనుకున్నారు. కానీ రాత్రికి రాత్రికే సీన్ మారిపోయింది. పార్టీపై పెత్తనం విజయసాయిరెడ్డికి వచ్చింది. ఈ మధ్యలో ఏం జరిగిందో వైసీపీ నేతలకూ అర్థం కావడం లేదు.
అయితే జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల గుట్టుముట్లన్నీ విజయసాయిరెడ్డికి తెలుసని.. తనను అవమానించి పక్కన పెడితే అప్రూవర్‌గా మారిపోతానని బెదిరించారని.. అందుకే ఆయనకు రాత్రికి రాత్రే పదవి ఇచ్చారని టీడీపీ నేతలు చెబుతున్నారు. బ్లాక్ మెయిల్ చేయడం వల్లే.. పక్కన పెట్టిన విజయసాయి రెడ్డికి అందరికంటే పెద్ద పదవి ఇచ్చారని టీడీపీ నేత బుద్దా వెంకన్న తేల్చేశారు. విజయసాయిని సీఎం జగన్ పక్కన పెట్టారని వైసీపీ నేతలే అంటున్నారని ఉన్నట్టుండి కీలక బాధ్యతలు అప్పజెప్పారంటే అందుకు బ్లాక్ మెయిలే కారణమన్నారు.
మంత్రి వర్గం కూర్పులోనూ సీఎం జగన్ భయపడ్డారని, తాను తొలగించాలనుకున్న వారికి తిరిగి మంత్రి పదవులిచ్చారని, పదవులివ్వలేని వాళ్లను బుజ్జగించారని బుద్దా వెంకన్న అంటున్నారు. టీడీపీ నేతలు ఎన్ని మాటలైనా చెబుతారు కానీ… విజయసాయిరెడ్డికి హఠాత్తుగా ప్రాధాన్యం వెనుక ఏం జరిగింతో ఖచ్చితంగా తమకూ తెలియడంలేదని వైసీపీ నేతలే గింజుకుంటున్నారు. సజ్జలను రాజ్యసభకు పంపిస్తారన్న ప్రచారం వారిలో ఊపందుకుంది. అదే జరిగితే..సజ్జలను సలహాదారుగా కూడా తొలగిస్తారని .. అప్పుడు విజయసాయిరెడ్డిదే హవా ఉంటుందంటున్నారు.