గత ఇరవై ఏళ్లుగా జరిగిన మత మార్పిడులపై విచారణ చేయించాలని వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో డిమాండ్ చేశారు. ఆయన డిమాండ్ ఆసక్తికరంగా మారింది. నిరుపేదలకు డబ్బులు ఇచ్చి మత మార్పిళ్లకు పాల్పడుతున్నారన్న. ఓ వీడియోను వెద్కుకుని మరీ ట్వీట్ చేసి…ఈ డిమాండ్ చేశారు. విజయసాయిరెడ్డి ఇలా చేయడానికి కారణం ఏమిటో స్పష్టత లేదు కానీ.. ఆయన ఇంటెన్షన్ మాత్రం జగన్ రెడ్డి చేసిన మరో భయంకర స్కాం గురించి లీకులు ఇవ్వడమేనని ఎక్కువ మంది అనుమానిస్తున్నారు. ఆ స్కాం మత మార్పిళ్లు !
మత మార్పిళ్ల ఉద్యమం చేసిన జగన్
2019-2024 మధ్య ఏపీలో మత మార్పిళ్ల ఉద్యమం జరిగింది. కొన్ని లక్షల మందిని మతం మార్చేందుకు ప్రయత్నించారు. ఎక్కడికక్కడ మత మార్పిళ్లు చేసేందుకు ప్రత్యేకంగా ఈత కొలనుల్లాంటి ఏర్పాట్లు చేశారు. కొన్ని చోట్ల ఈ వివాదాలు కోర్టుకు వెళ్లాయి.వైసీపీ ఎమ్మెల్యేలంతా మత మార్పిళ్లను ప్రోత్సహిస్తూ దొరికిపోయారు. చాలా మంది వీడియోలు బయటకు వచ్చాయి. మతం మార్చుకున్నవారు జగన్ రెడ్డికి ఓటు బ్యాంకుగా మారుతారని.. జగన్ అదే మతం కాబట్టి… చర్చిల్లో ప్రార్థనలు చేయించి ఓటు బ్యాంకుగా మారుస్తారన్నది అందరికీ తెలిసిన నిజమే. కంచె ఐలయ్య లాంటి వాళ్లతో మత మార్పిడిహక్కు అని వ్యాసాలు రాయించి సాక్షి పత్రికలో ప్రముఖంగా ప్రచురించేవారు. అప్పుడు విజయసాయిరెడ్డికి ఈ విషయం తెలియనిది కాదు.
ఇప్పటికీ మత మార్పిళ్ల మాఫియా ఉనికి
మత మార్పిళ్ల మాఫియా అనేది ఏపీకి పరిమితం కాదు. దేశవ్యాప్తంగా ఉంది. విదేశాల నుంచి క్రిస్టియన్ సంస్థలు పెద్ద ఎత్తున నిధులు తెస్తాయి. మత మార్పిళ్లు చేస్తున్నామని చెప్పి విరాళాలు సేకరిస్తాయి. అప్పట్లో ఈ మత మార్పిళ్లు ఎలా ఉండేవో చెప్పాల్సిన పని లేదు. ప్రభుత్వాలను బట్టి మత మార్పిళ్ల మాఫియా చెలరేగిపోయేది. పేద ప్రజలకు ఏదో సాయం చేసి వారిని మతం మార్చేస్తున్నారు. తర్వాత వారిని జలగల్లా పీల్చి పిప్పిచేస్తున్నారు. ఊరూవాడా.. వీధివీధినా వెలసిన చర్చిల్లో దశమభాగాల పేరుతో పేదల ఆదాయాన్ని పిండుకుంటున్నారు. రాజకీయాలతో పాటు.. ఇలాంటి పేదల దోపిడీ ప్రయత్నాలతో మతాన్ని మారుస్తున్నారు. ల
విజయసాయిరెడ్డి డిమాండ్ మేరకు విచారణ చేయిస్తే?
మతం అనేది సున్నితమైన విషయం . అది వ్యక్తిగత అంశం. పాటించాలా లేదా అన్నది వారిష్టం. కానీ అనుచితంగా.. డబ్బులు ఆశచూపి హిందూ మతం నుంచి వేరే మతంలోకి మళ్లించడం మాత్రం క్షమించరాని విషయం. హిందూత్వం అది భారతీయ ఆత్మలో ఉంటుంది. రాజకీయ స్వార్థం కోసం హిందూత్వాన్ని బలి చేసేందుకు ప్రయత్నించిన వారిని టార్గెట్ చేయాల్సిందే. ప్రభుత్వాలు విజయసాయిరెడ్డి డిమాండ్ పై దృష్టి సారిస్తే.. హిందూత్వంపై అంటే దేశంపై ద్రోహం చేసిన వారు చాలా మంది దొరికిపోతారు. అందులో జగన్ కూడా ఉంటారు.
